కాలువ, కాపు మధ్య సవాళ్లతో అనంతలో టెన్షన్: పోలీసుల అదుపులో మాజీ మంత్రి
అనతపురం జిల్లాలోని హనుమాపురంలో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది. అభివృద్దిపై సవాళ్లు టెన్షన్ కు కారణమయ్యాయి. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురం: మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులును గురువారంనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభివృద్ది విషయమై రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మధ్య సవాళ్లు గురువారంనాడు కనెకల్ మండలం హనుమాపురంలో ఉద్రిక్తత నెలకొంది.
ఎవరి హయంలో అభివృద్ది జరిగిందో చర్చకు సిద్దమని కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ విషయమై మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు చర్చకు సిద్దమా అని కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. హనుమాపురం వేదికగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ కు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు స్పందించారు.
కాపు రామచంద్రారెడ్డి సవాల్ మేరకు ఇవాళ కనేకల్ మండలం హనుమాపురం చేరుకున్నారు. అభివృద్దిపై చర్చకు తాను వచ్చానని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రకటించారు. అయితే కాపు రామచంద్రారెడ్డి ఎక్కడికి వెళ్లాడని ఆయన ప్రశ్నించారు. తనకు సవాల్ విసిరి కాపు రామచంద్రారెడ్డి ఎక్కడికి వెళ్లాడని ఆయన ప్రశ్నించారు.
హనుమాపురం వద్దకు కాలువ శ్రీనివాసులు వచ్చిన సమయంలో ఆయన వెంట టీడీపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. మరో వైపు వైసీపీ క్యాడర్ కూడా అక్కడికి చేరుకున్నారు. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరువర్గాలు నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు.