పీఆర్సీ విషయంగా రాష్ట్ర ప్రభుత్వం- ఉద్యోగ సంఘాల మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3న చలో విజయవాడకు పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘాల నేతలు . అయితే దీనిని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
పీఆర్సీ విషయంగా రాష్ట్ర ప్రభుత్వం- ఉద్యోగ సంఘాల మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3న చలో విజయవాడకు పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘాల నేతలు . అయితే దీనిని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. విజయవాడ నగరంలో రేపు ఆంక్షలు విధించారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్‌టీఎస్ రోడ్డులో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతోనూ పోలీసులు నిఘా పెట్టారు.
కాగా.. పీఆర్సీ (prc) కోసం ఉద్యమిస్తున్న ప్రభుత్వోద్యోగులకు పోలీస్ శాఖ (ap police) షాకిచ్చింది. ఈ నెల 3న ఛలో విజయవాడకు (chalo vijayawada) అనుమతి నిరాకరిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతిరాణా (kranthi rana tata) మంగళవారం తెలిపారు. కరోనా నిబంధనల (covid) కారణంగా ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వడం లేదని సీపీ పేర్కొన్నారు. ఛలో విజయవాడ కార్యక్రమం చట్టవిరుద్ధమని క్రాంతి రాణా అన్నారు. ఉద్యోగుల కాండాక్ట్ రూల్స్ ప్రకారం కూడా.. ఛలో విజయవాడ కార్యక్రమం చేయకూడదని సీపీ వ్యాఖ్యానించారు.
మరోవైపు ప్రభుత్వ సంప్రదింపుల కమిటీతో PRC సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు (ఏపీ Employees సంఘాల నేతలు) మంగళవారం నాడు సచివాలయంలో భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానిస్తూ మంత్రుల కమిటీ సోమవారం నాడు రాత్రి లేఖలు పంపింది. పీఆర్సీ సాధన సమితిలో కీలకంగా ఉన్న నేతలందరికీ కూడా AP Govenrment ఈ lettersలను అందించింది.
రాష్ట్ర ప్రభుత్వం నుండి లిఖితపూర్వక హామీ వస్తేనే చర్చలకు హాజరరౌతామని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వం నిన్న లిఖితపూర్వకంగా ఉద్యోగులను చర్చలకు ఆహ్వానం పంపింది.అయితే గతంలో తాము ప్రభుత్వం ముందుంచిన పీఆర్సీ జీవోలను అభయన్స్ లో పెట్టాలని, పాత జీతాలను ఇవ్వాలని, ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయట పెట్టాలని కూడా పీఆర్సీ సాధన సమితి డిమాండ్ చేసింది.ఈ డిమాండ్లకు తలొగ్గి రాత పూర్వకంగా చర్చలకు ఆహ్వానిస్తే తాము చర్చలకు వెళ్తామని సోమవారం నాడు పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు.
అటు ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయన్నారు వైసీపీ నేత, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాన సమస్యలపై చర్చిద్దామంటే 3 డిమాండ్లపైనే పట్టుబడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యోగుల కార్యాచరణ ప్రారంభం కాకముందే చర్చల ద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చర్చల కోసం ప్రభుత్వం వైపు నుంచే ముందుగా చొరవ తీసుకున్నామని ఆయన అన్నారు. సమ్మెకు వెళ్లకముందే ఉద్యోగులు రోడ్డెక్కడం కరెక్ట్ పద్ధతి కాదని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు.
అవసరం లేని చోట ఎవరిమీద బలప్రదర్శన చేస్తున్నారని రామకృష్ణారెడ్డి చెప్పారు. వైషమ్యాలు పెంచడం ద్వారా ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ ఆంక్షలు అమలులో వున్నందున ఆందోళనకు అనుమతి ఇవ్వరని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్ధితిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సజ్జల హితవు పలికారు. ఒకరకంగా ఉద్యోగులు రేపు చేయబోయేది బలప్రదర్శనే అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జఠిలమైన డిమాండ్లు పెట్టడం పరిష్కారం లేకుండా చేసుకోవడం కాదా అని ఆయన ప్రశ్నించారు.
