Asianet News TeluguAsianet News Telugu

బంగారు కోసం వృద్ధురాలిని చంపిన బెజవాడ యువకులు

గోంతు నులిమి చంపిన తరువాత చనిపోయిందని నిర్ధారించుకుని ఒంటిపై ఉన్న నాను, దిద్దులు కొంత నగదు తీసుకుని పారిపోయారు

police crack the murder of seventy year old woman by vijayawada youth

విజయవాడ పాత పాయకపురం కోదండ రామాలయం వీధిలో ఉంటున్నవ ఆకుశేట్టి అన్నపూర్ణమ్మ (70 ) వృద్ధురాలు మే నేల 19 తేదిన హత్య చేసి దోపిడీ చేసిన ఇద్దరు వ్యక్తులు ను అరెస్టు చేసి వారి వద్ద నుండి 28గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

 కేసును ఛేదించిన విధానాన్ని విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ రమణ కుమార్ ఈ సాయంకాలం విలేకరులకు వెల్లడించారు.

అన్నపూర్ణమ్మ మనవడు ఇచ్చిన ఫిర్యాదు తో దర్యాప్తు చేసి కొత్త రాజీవ్ నగర్ కి చెందిన కళ్లేపల్లి ప్రకాష్ అతని స్నేహితుడు ఇండ్ల సాయిప్రతాప్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తే  నిజం వెలుగు చూసింది.ప్రకాష్ ఆటో నడుపుతూ చెడు వ్యసనాలకు బానిసై అనేక దోపిడీ లు చేశాడు. ఒక హత్య కేసులో జైలు కు వెళ్ళి బెయిల్ మీద వచ్చాడు.  ప్రకాష్ అతని స్నేహితుడు సాయిప్రతాప్ ల మీద పాయకపురం ,మాచవరం ,పటమట,సూర్యరావు పేట పోలిస్ స్టేషను లో కేసు ఉన్నాయి

హత్యకు గురైన అన్నపూర్ణమ్మ పాయకపురంలోని పెట్రోల్ బంకు దగ్గర ప్రకాష్ ఆటో కిరాయి కి మాట్లాడుకుని ఎక్కింది. ఆటో లో వెళ్ళిన అన్నపూర్ణమ్మ బియ్యం బస్తాను ఇంట్లో పెట్టిన ఆటో డ్రైవర్ ప్రకాష్ అ సమయంలో అన్నపూర్ణమ్మ ఒంటరిగా ఉంటుందని గమనించాడు.  దోపిడీ చేయ్యలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులైన సాయి ప్రశాంత్  నాగేంద్రబాబు లకు తన పథకం విషయం చెప్పాడు.

ముగ్గురు కలసి  బైక్ మీద మే 19 అర్దరాత్రి సమయంలో వృద్ధురాలు ఇంటికి వెళ్ళారు.  బైక్ ను దూరంగా నిలిపి నడుచుకుంటూ వృద్ధురాలు ఇంటికి వెళ్ళి, తలుపు తట్టి ఆమెను నిద్రలేపారు. అమాంతం ఆమె పట్టి,  దిండుతో ముఖం మీద మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపారు. ఆమె  చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత, ఆమె ఒంటిపై ఉన్న నానును, చెవి దిద్దులు కొంత నగదు తీసుకుని పారిపోయారు.

 తర్వాత  వృద్ధురాలి మనవడు ఇచ్చిన ఫిర్యాదు తో అనేక కోణాల లో  పోలిసులు దర్యాప్తు చేసి కేసును మొత్తానికి ఛేదించగలిగారని జాయింట్ కమిషనర్ తెలిపారు.

ఈ రోజు సింగ్ నగర్ ప్లైఓవర్ సమీపంలో నిందితులు ప్రకాష్ సాయి ప్రశాంత్ ని అరెస్టు చేసి వారి వద్ద నుండి 28గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కూడా ఆయన చెప్పారు.

ఈ కేసులో ఉన్న మూడవ నిందితుడు నాగేంద్రబాబు పగటి దొంగతనాలు కేసులో ఇటీవలే అరెస్టయ్యి జైలులో ఉన్నాడు

Follow Us:
Download App:
  • android
  • ios