Asianet News TeluguAsianet News Telugu

అధికారులపై టీడీపీ మాజీ ఎంపీటీసీ దౌర్జన్యం

ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ఆ స్థలం ఆక్రమించుకుని చాలా కాలంగా అందులో ఉన్న దుకా ణం అద్దెకు ఇచ్చుకుని ప్రతీ నెలా వేలాది రూపాయల ఆదాయం పొందుతున్నారని అంటున్నారు. ఆ స్థలంపై కోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని మాజీ ఎంపీటీసీ వాదిస్తున్నారు.

Police Complaint Against EX MPTC Over Attack on Officers
Author
Hyderabad, First Published Oct 14, 2020, 4:39 PM IST

దేవదాయ శాఖ అధికారులపై టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ దౌర్జన్యానికి పాల్పడ్డారు. దేవదాయ శాఖకు చెందిన స్థలంలో టీడీపీ మాజీ ఎంపీటీసీ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో దానిపై నిజాలు తెలుసుకునేందుకు అధికారులు వెళ్లగా.. వారిపై ఆమె దౌర్జన్యానికి పాల్పడ్డారు. దేవదాయశాఖ అధికారులు, సిబ్బంది ని మెయిన్‌రోడ్‌పై నిలబెట్టి ఆ మాజీ ఎంపీటీసీ, ఆమె కు టుంబ సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. సాక్ష్యాలను వీడియో చిత్రీకరిస్తున్న దేవదాయశాఖ ఉద్యోగిని దగ్గర్లోని ఓ దుకాణంలోకి లాక్కెళ్లి దాడి చేసినట్లు తెలుస్తోంది. అధికారి ఒంటిపై దుస్తులు చింపేసి ఫోన్ కూడా లాక్కున్నట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా చీపురుపల్లి మెయిన్‌రోడ్‌లో శ్రీ ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి సర్వే నంబర్‌ 45/1లో 1.42 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలో మెయిన్‌రోడ్‌ను ఆనుకుని 10/15 అడుగుల వెడల్పున తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఆరతి సాహు, ఆమె భర్త రామచంద్రసాహు ఆక్రమణకు పాల్పడినట్లు దేవదాయశాఖ అధికారులు చెబుతున్నారు. 

ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ఆ స్థలం ఆక్రమించుకుని చాలా కాలంగా అందులో ఉన్న దుకా ణం అద్దెకు ఇచ్చుకుని ప్రతీ నెలా వేలాది రూపాయల ఆదాయం పొందుతున్నారని అంటున్నారు. ఆ స్థలంపై కోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని మాజీ ఎంపీటీసీ వాదిస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం ఆ స్థలంలో శాశ్వత కట్టడాలు ప్రారంభించడంతో గుర్తించిన దేవదాయశాఖ ఈఓ కిశోర్‌కుమార్‌ సాక్ష్యాలు సేకరించేందుకు సిబ్బందితో కలిసి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆరతి సాహుతో పాటు కుటుంబ సభ్యులు అధికారులను అడ్డుకున్నారని, అక్కడ జరుగుతున్న సంఘటన మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్న అప్పలరాజు అనే ఉద్యోగిని దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది.  దీంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios