చంద్రబాబు లాయర్ లూథ్రాపై పోలీసులకు ఫిర్యాదు...
చంద్రబాబునాయుడు లాయర్ లూథ్రాపై మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టేలా ట్వీట్ చేశారంటూ ఆరోపించారు.

రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాయర్ లూథ్రాపై పోలీసులకు ఫిర్యాదు అందింది. లూథ్రా ట్వీట్ పై మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబునాయుడుతో ములాఖత్ అయిన తరువాత లూథ్రా ఓ ట్వీట్ చేశారు.
దీనిమీద సూర్యప్రకాశరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయుధాలతోనే పని జరుగుతుందని రెచ్చగొట్టేలా ట్రీట్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. హింసను ప్రేరేపించేలా ట్రీట్ చేసిన లూథ్రాపై చర్యలు తీసుకోవాలని వినతి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
న్యాయం కనుచూపు మేరలో లేనప్పుడు.. : చంద్రబాబు లాయర్ లూథ్రా ఆసక్తికర పోస్టు..