పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతగల ప్రధానోపాధ్యాయుడి ఉద్యోగంలో వున్న ఓ వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే పనిచేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు యువతులను ఒకరికి తెలియకుండా మరోకరిని పెళ్లి చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. శీలం సురేశ్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2011లో గుంటూరుకు చెందిన శాంతిప్రియతో, 2015లో ఉయ్యూరుకు చెందిన శైలజతో, 2019లో విశ్వనాథపల్లికి చెందిన అనూషతో ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు.

Also Read:నిత్య పెళ్లికొడుకు అరెస్ట్: 23 ఏళ్లలో నాలుగు పెళ్లిళ్లు

అయితే అతనిపై రెండో భార్య శైలజకు అనుమానం రావడంతో సురేశ్ గుట్టురట్టయ్యింది. దీంతో ఆమె దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతని తీరుపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. ముగ్గురు యువతులను మోసం చేసినందుకు గాను నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.