అనంతపురంకు చెందిన వైసిపి నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకపుడు ప్రత్యకహోదాపై జిల్లాలో ఉద్యమాలు చేసినందుకు పోలీసులు శుక్రవారం కేసులు పెట్టారు. పెద్దారెడ్డితో పాటు మరో 53 మందిపైన కూడా కేసులు నమోదయ్యాయి. కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల మధ్య మొదలైన ఘర్షణ వాతావరణం ప్రభావం రాష్ట్రంలోని వైసిపిపై పడింది. 

బిజెపి-టిడిపి మధ్య సంబంధాలు చెడిపోవటానికి ప్రధాన కారణం వైసిపినే అని టిడిపి నేతలు మండిపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే బిజెపిని ఏమీ అనలేని ప్రభుత్వ పెద్దలు ఎప్పుడో జరిగిన ఉద్యమానికి సంబంధించి ఇపుడు వైసిపి నేతలపై కేసులు నమోదు చేయటం విచిత్రంగా ఉంది.