Asianet News TeluguAsianet News Telugu

ఎంఎల్ఏపై కేసు నమోదు చేసారు

ఎంఎల్ఏపై కనీసం కేసు కూడా పెట్టలేకపోతే శాఖ పరువు పోతుందని భావించారు. అందుకనే అదే ఎస్ఐతో  ఫిర్యాదు చేయించి ఎంఎల్ఏపై 342, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.   

Police booked a case on tanuku mla

మొత్తానికి అధికార పార్టీ ఎంఎల్ఏ రాధాకృష్ణపై పోలీసులు కేసు పెట్టారు.  తణుకులో రెండు రోజుల క్రితం ఇరగవరం ఎస్ఐ, రైటర్ ను తన కార్యాలయంలో నిర్బంధించిన తణుకు ఎంఎల్ఏ రాధాకృష్ణపై కేసు నమోదు చేసి పోలీసులు తమ పరువు నిలుపుకున్నారు. తన మనుషులపై కేసు పెట్టటమే కాకుండా అరెస్టు కూడా చేయటంతో ఎంఎల్ఏకి మండింది. దాంతో ఎస్ఐ, రైటర్ ను తన కార్యాలయానికి పిలిపించుకుని నేలపైనే కూర్చోబెట్టారు.

తన మాటనే ఖాతరు చేయరా అంటూ వారిద్దరిని ఎంఎల్ఏ నిర్బంధించటం సంచలనంగా మారింది. రెండు రోజుల పాటు తర్జనభర్జన పడిన పోలీసులు ఎంఎల్ఏపై కనీసం కేసు కూడా పెట్టలేకపోతే శాఖ పరువు పోతుందని భావించారు. అందుకనే అదే ఎస్ఐతో  ఫిర్యాదు చేయించి ఎంఎల్ఏపై 342, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. కాకపోతే పోలీసులు ఎంఎల్ఏపై కేసు నమోదు చేయటంతో అధికార పార్టీ ఎంఎల్ఏలందరూ మండిపడుతున్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios