Asianet News TeluguAsianet News Telugu

ఒంట‌రి మ‌హిళ‌ల‌ను చూసి ట్రాప్ చేస్తాడు.. న‌గ‌ల‌న్నీ దోచుకెళ్తాడు..

ఒంటరిగా జీవిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారిని మాయలోకి దించి నగలు ఎత్తుకెళ్తున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. మీడియాకు వివరాలు వెల్లడించారు. 

Police arrests man for trapping single women and robbing them of jewellery.
Author
Guntur, First Published Aug 5, 2022, 11:54 AM IST

ఒంట‌రిగా నివసిస్తున్న మ‌హిళ‌లే అత‌డి టార్గెట్. మెళ్ల‌గా వారిని మాట‌ల్లోకి దించుతాడు. త‌న మాయ‌లో ప‌డేలా చేస్తాడు. ‘‘పెళ్లి చేసుకుందాం.. క‌లిసి జీవిద్దాం’’ అని న‌మ్మిస్తాడు. అత‌డి మాట‌లు న‌మ్మిన మ‌హిళ‌ల‌ను దోచుకొని పరార‌వుతుంటాడు. వారి వ‌ద్ద ఉన్న న‌గ‌లను తీసుకొని ఉడాయిస్తుండాడు. అయితే ఇలాంటి ప‌నులు ఎంతో కాలం సాగ‌వు క‌దా.. ఇక్క‌డా కూడా అదే జ‌రిగింది. అత‌డి మోసాల‌ను పోలీసులు గుర్తించారు. నిందితుడిని ప‌ట్టుకొని అత‌డు చేస్తున్న మోసాల‌ను ఏపీలోని విజ‌య‌వాడ‌ పోలీసులు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. 

అత్తను అతికిరాతకంగా చంపిన కోడలు.. తలపై కర్రతో కొట్టి, గొంతుపిసికి, చీరతో ఉరి బిగించి హత్య...

విజయవాడ డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ ర‌వికిర‌ణ్ గురువారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈ వివ‌రాలు అన్నీ వెల్ల‌డించారు. ఇందులో నిందితుడి పేరు వెందేటి చంద్ర. వ‌య‌స్సు 56 ఏళ్లు. అత‌డు ఏపీలోని నెల్లూరు కోట మండ‌లానికి చెందిన వాడు. అత‌డిని చేవూరి చంద్ర అని కూడా పిలుస్తుంటారు. నిందితుడు త‌న 14 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఇంటి నుంచి పారిపోయాడు. అనంత‌రం తిరుప‌తికి వ‌చ్చాడు. ఓ లాడ్జీలో ప‌ని చేశాడు. ఈ స‌మ‌యంలో అక్క‌డికి ప‌లువురు మ‌హిళ‌లు వ‌చ్చి వ్య‌భిచారం చేయ‌డం గ‌మ‌నించాడు. ఆ స‌మంయ‌లో నిందితుడికి ఓ ఐడియా వ‌చ్చింది. 

‘పాల‌న‌లో జ‌గ‌న్ ఫెయిల్.. నేను ప్రధాని కావాల‌ని 18 పార్టీలు కోరుతున్నాయి’ - కేఏ పాల్‌

అత‌డు తాను ఓ బంగారు వ్యాపారి అని మ‌హిళ‌ల‌తో ప‌రిచయం చేసుకునేవాడు. ఆ ప‌రిచ‌యాన్ని పెంచుకొని, న‌మ్మించి వారి వ‌ద్ద ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల‌ను దోచుకోవ‌డం ప్రారంభించాడు. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు 32 మంది మ‌హిళ‌లను మోసం చేశాడు. ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో అత‌డు ఈ నేరాల‌కు పాల్ప‌డ్డాడు. ఇందులో చిత్తూరు జిల్లా, తిరుప‌తి, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, విజ‌య‌వాడ ప్రాంతాల‌తో పాటు ప‌క్క రాష్ట్రం అయిన చెన్నైలో కూడా ఇదే త‌ర‌హా మోసాలు చేశాడు. 

అయితే ఓ సారి గూడురు పోలీసుల‌కు చిక్కాడు. కానీ వారి క‌స్ట‌డీ నుంచి త‌ప్పించుకొని పారిపోయాడు. ఓ స‌మయంలో విజ‌య‌వాడ పోలీసుల‌కు కూడా చిక్కాడు. వారు అత‌డిని అరెస్టు చేసి జైలులో కూడా ఉంటారు. ఈ క్ర‌మంలో ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జైలు నుంచి విడుద‌ల అయ్యాడు. కానీ మోసాలు చేయ‌డం మాన‌లేదు. త‌న పాత జీవ‌న విధానాన్నే కొన‌సాగించాడు. అయితే విజ‌య‌వాడ జిల్లాలోని భ‌వానీపురానికి చెందిన ఓ మ‌హిళను కూడా ఇదే త‌ర‌హాలో మోసం చేశాడు. దీంతో ఆమె జూన్ లో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు వేగ‌వంతం చేశారు.

భార్యపై అనుమానం.. గొంతు పిసికి చంపి, కాలువలో విసిరేసి...మిస్సింగ్ డ్రామా...

ఈ క్ర‌మంలో నిందితుడు విజ‌య‌వాడ‌లోని ఓ లాడ్జీకి మ‌రో మ‌హిళ‌ను తీసుకొని వ‌చ్చాడు. దీంతో అత‌డిని, మ‌హిళ‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టుకు తీసుకెళ్లారు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 32 మందిని ట్రాప్ లోకి దించాడ‌ని పోలీసులు గుర్తించారు. నిందితుడి వ‌ద్ద నుంచి 61.5 గ్రాముల బంగారు ఆభ‌ర‌ణాల‌ను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios