గత నెల 23న ఖమ్మంకు చెందిన జి. రామలింగస్వామి సూర్యాపేటలోని ఓ లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అతను రాసిన సూసైడ్ నోట్ లో శివాపురం సర్పంచి లక్ష్మణరావు డబ్బుల కోసం ఒత్తిడి తీసుకురావడం వల్లే తాను చనిపోతున్నట్లు స్పష్టం చేశారు. సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మణరావు మీద కేసు నమోదయ్యింది. 

పెనుగంచిప్రోలు : cryptocurrency కేసులో Telangana police పెనుగంచిప్రోలు మండలం శివాపురం సర్పంచి తేళ్ల లక్ష్మణరావు (వైసీపీ)ను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గత నెల 23న ఖమ్మంకు చెందిన జి. రామలింగస్వామి సూర్యాపేటలోని ఓ లాడ్జిలో forced deathకి పాల్పడిన సంగతి తెలిసిందే. 

అతను రాసిన Suicide node లో శివాపురం సర్పంచి లక్ష్మణరావు డబ్బుల కోసం ఒత్తిడి తీసుకురావడం వల్లే తాను చనిపోతున్నట్లు స్పష్టం చేశారు. సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మణరావు మీద కేసు నమోదయ్యింది. అప్పటినుంచి సర్పంచి పరారీలో ఉన్నారు. Lakshmana Rao తన మిత్రుల సలహా మేరకు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు.

 ఖమ్మంకు చెందిన రామలింగస్వామి, జిల్లాలోని జి కొండూరు మండలం రామచంద్రాపురం, గుడివాడకు చెందిన మరో ఇద్దరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. లక్ష్మణరావు సుమారు రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. లాభాలు లేకపోగా పెట్టిన డబ్బులు కూడా తిరిగి రాకపోవడంతో లక్ష్మణరావు పలుమార్లు భాగస్వాములను ప్రశ్నించారు. 

వారందరినీ పెనుగంచిప్రోలు పిలిపించి రాజకీయ అండతో బెదిరించి బలవంతంగా డబ్బులు, బంగారం, కార్లు గుంజుకున్నట్లు మృతుని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. రామలింగస్వామి బలవన్మరణం తర్వాత మీడియా ముందుకు వచ్చిన లక్ష్మణరావు అతని మృతికి తాను కారణం కాదని వివరణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో లక్ష్మణరావును సోమవారం రాత్రి తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక వైసీపీ నాయకులు న్యాయవాదులతో కలిసి సూర్యాపేట వెళ్లారు. అక్కడి పోలీసులు లక్ష్మణరావు అరెస్ట్ చూపలేదు. మరొకరిని పట్టుకున్న తర్వాత అరెస్ట్ చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Crypto Currency : సూర్యాపేటలో ఖమ్మం వ్యాపారి ఆత్మహత్య, బయటపడుతున్న నకిలీ క్రిప్టో కరెన్సీ మూలాలు..

ఇదిలా ఉండగా, నవంబర్ 26న ఆన్‌లైన్‌లో పెట్టుబడుల కోసం తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని ఫైనాన్షియర్ లు వేధింపులకు గురిచేయడంతో ఓ వ్యాపారి మంగళవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. అయితే, ఈ ఆన్‌లైన్ నష్టాలు క్రిప్టో కరెన్సీ పెట్టుబడులతో ముడిపడి ఉన్నాయా అనే కోణంలో ఆ సమయంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

సదరు వ్యాపారవేత్త ఇంతకుముందు పాఠశాలలను నడిపేవాడు.. కరోనా కారణంగా నష్టాలు రావడంతో వాటిని మూసేశాడు. సూర్యాపేట టౌన్‌లోని కొత్త బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జి వాష్‌రూమ్‌లో రామలింగ స్వామి(36) శవమై కనిపించాడు. అతను విషం తాగాడని తేలింది. రామలింగస్వామి ఖమ్మంలోని యెల్లందు నివాసి. Ramalinga Swamy మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్ లో ఆన్‌లైన్‌లో పెట్టుబడులు, ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియర్ వేధింపుల గురించి ప్రస్తావించినట్టు పోలీసులు గుర్తించారు.

“క్రిప్టో కరెన్సీలో తాను నష్టపోయానని Suicide note‌లో నేరుగా ప్రస్తావించలేదు. కానీ, అతను crypto currencyలో ఉన్నాడని అతని కుటుంబం పేర్కొంది, ”అని Suryapet టౌన్ పోలీసులు ఆ సందర్బంలో చెప్పారు. అతని కుటుంబం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, కోవిడ్ వల్ల పాఠశాలవ్యాపారం దెబ్బతినడంతో.. స్వామి Crypto currencyలోకి దిగాడు. మొదట్లో లాభాలు రావడంతో కొంతమంది వ్యక్తుల నుండి రామలింగస్వామి లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని దీంట్లో పెట్టాడు. కానీ నష్టాలు వచ్చాయని, అతని కుటుంబం పేర్కొంది.