సంచలనం సృష్టించిన టీడీపీ నేత అంకులు హత్య కేసులో పోలీసులు తాజాగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పెదగార్లపాడుకు చెందిన పురంశెట్టి‌ అంకుల్‌ ని ఆయన నిర్మిస్తున్న అపార్ట్మెంట్ లోనే గొంతు కోసి చంపారు. 

కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురైన ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో అదే పార్టీకి చెందిన నేత హత్యకు గురయ్యాడు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో తెలుగుదేశం పార్టీ నేతను ప్రత్యర్ధులు హతమార్చారు. 

ఈ కేసులో అంకులు డ్రైవర్ మస్తాన్ వలితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని  పోలీసులు విచారిస్తున్నారు. చివరి కాల్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో భాగంగా గ్రామానికి చెందిన అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

ఎస్సై బాలనాగిరెడ్డిపైనే ఆరోపణలు రావటంతో కేసును చేధించే పనిలో పడ్డారు పోలీసులు. ఉన్నతాధికారుల ఆదేశంతో రంగంలోకి దిగిన మూడు ప్రత్యేక బృందాలు కేసును చేధిస్తున్నాయి.