అధికారులపై వైసిపి ఎంఎల్ఏ ఎలా రెచ్చిపోయారో చూడండి (వీడియో)

Police arrested Nellore ycp mla anilkumar
Highlights

  • నెల్లూరు ఎంఎల్ఏ అనిల్ కుమార్ యాదవ్ రెచ్చిపోయారు

నెల్లూరు ఎంఎల్ఏ అనిల్ కుమార్ యాదవ్ రెచ్చిపోయారు. అర్ధరాత్రి పేదల ఇళ్ళను కూల్చేసిన అధికారులపై గురువారం ఉదయం మండిపడ్డారు.  బాధితులను వెంటపెట్టుకుని ఆర్డిఓ కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నా చేసారు. ఏడాది నుండి సమస్య పరిష్కరించకుండా నానబెట్టి చివరకు చెప్పాపెట్టకుండా అర్ధరాత్రిపూట పేదల ఇళ్ళను కూల్చేయటమేంటని అధికారులను నిలదీసారు. ఆర్డీఓ, ఎంఆర్వోలను ఉద్దేశించి ‘ఏం గాడిదలు కాస్తున్నారా’ అంటూ ధ్వజమెత్తారు. ఎవరి ఇల్లైన కూల్చే ముందు ప్రత్యామ్నాయాలు చూపటం సహజం కాదా ? అంటూ నిలదీసారు. ‘ ఇళ్ళల్లో మీ భార్య బిడ్డలుంటే అదే విధంగా కూల్చేస్తారా అంటూ రెచ్చిపోయారు. ఎంఎల్ఏ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని అధికారులు చివరకు అరెస్టు చేయించి అక్కడి నుండి పంపేసారు.

 

loader