విజయవాడ: మంత్రి పేర్ని నాని అనుచరుడు, మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, టిడిపి నాయకులు కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద జాతీయ రహదారి పై రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ వైపు వెళ్తున్నట్లు తెలుసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు మప్టీ లో వెళ్లి అరెస్ట్ చేశారు.కొల్లు రవీంద్ర ప్రయాణిస్తున్న కారును ఆపి అదుపులోకి తీసుకున్న పోలీసులు తుని నుండి విజయవాడ కు తరలించారు.   

మంత్రి పేర్ని నాని అనుచరుడు, మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో టిడిపి నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం వున్నట్లు ప్రదాన నిందితులు తెలిపారని డిఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. ఆయన ప్రోద్భలంతోనే ఈ  హత్య చేసినట్లు ప్రధాన నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు డిఎస్పీ వెల్లడించారు. 

read more   వైసిపి నేత హత్యలో కుట్రదారుగా కొల్లు రవీంద్ర... ఉల్లింగిపాలెంలో ఉద్రిక్తత
 
వైఎస్సార్ సిపి నేత మోకా భాస్కరరావును హత్యచేసిన ప్రధాన నిందితులను ఆర్ పేట పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మొదట ముగ్గురు ఆ తర్వాత మరో ఇద్దరు అరెస్టయినట్లు... మొత్తంగా ఈ హత్య కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

నిందితులిచ్చి వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర పై 302,109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారని... ఆయన లేకపోవడంతో వెనుతిరిగినట్లు తెలిపారు. కొల్లు రవీంద్ర ప్రస్తుతం పరారీలో వున్నారని...ఆయన ఆచూకి కోసం 3 బృందాలను నియమించినట్లు డిఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు. ఇవాళ ఉదయం నుండి పోలీస్ బృందాలు గాలించగా చివరకు తుని వద్ద రవీంద్ర వారికి చిక్కారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.