అభం, శుభం తెలియని ఓ చిన్నారి పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన బనగానపల్లి మండలంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బనగానపల్లి మండల పరిధిలో ఓ చిన్నారి పై తమ్మడపల్లె గ్రామానికి చెందిన రుద్రేష్ అనే యువకుడు గురువారం అత్యాచారానికి పాల్పడ్డాడు.

చిన్నారి ఇంటికి ముందుకు ఆడుకుంటుండగా.. బలవంతంగా లోపలికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ సురేష్ కుమార్ రెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.  కర్నూలు నుంచి వచ్చిన క్లూస్ టీం సిబ్బంది వివరాలు సేకరించారు. వైద్య పరీక్షలు చేయగా.. చిన్నారిపై అత్యాచారం చేసినట్లే తేలిందని పోలీసులు తెలిపారు.  నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపా