అందమైన అమ్మాయిల ఫోటోలు సేకరించి.. వాటిని సోషల్ మీడియాలో ఎరగా వేసి ఓ యువకుడు డబ్బులు సంపాదించాడు. దాదాపు 3వేల మందిని ఈ ఫోటోలతో బురిడి కొట్టించడం గమనార్హం. వారి వద్ద నుంచి దాదాపు రూ.60లక్షలు పైగా కాజేయడం గమనార్హం. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విజయనగరం పట్టణానికి చెందిన అశ్వనీరాజు పదో తరగతి వరకు చదువుకున్నాడు. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అంతర్జాలంపై బాగా పట్టు సంపాదించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించే సమయంలో పట్టణానికి చెందిన సింధు భైరవి అనే విహితను తన కింద ఉద్యోగిగా చేర్చుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒడుదుడుకులతో సాగడం, చెడు వ్యసనాలకు బానిసవ్వడంతో సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

దీనిలో భాగంగా 2017 నుంచి అంతర్జాల వేదికగా అశ్లీల కార్యకాలాపాలకు తెరలేపాడు. అందులో భాగంగా అందమైన అమ్మాయిల ఫోటోలు, వీడియోలు ప్రజలను ఆకర్షించేందుకు ఓ వెబ్ సైట్ లో పెట్టాడు. మళ్లీ సింధుని తన అసిస్టెంట్ గా చేర్చుకున్నాడు. ఆమెతో అబ్బాయిలతో ఫోన్లు మాట్లాడించేవాడు. అలా ఆమెతో మాట్లాడించి  రూ.5వేల నుంచి రూ.8వేలు వరకు వసూలు చేసేవాడు. 

కాగా.. ఇటీవల ఓ ఎన్ఆర్ఐ ని కూడా ఇదేవిధంగా మోసగించారు. సదరు ఎన్ఆర్ఐ రూ.8,500కి బదులు రూ.85వేలు పంపించాడు. దీంతో.. వారితో మాట్లాడదామని ప్రయత్నిస్తే.. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో.. అతను పోలీసులను ఆశ్రయించగా.. అసలు మోసం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు 3వేల మందిని ఇదే విధంగా మోసం చేసినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.