విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన కేసులో యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం సచివాలయం కార్యదర్శి షేక్ సాధిక్ అలీని పోలీసులు అరెస్టు చేశారు. 

పోలీసుల కథనం మేరకు.. సాధిక్ అలీ 2016 లో మండలంలోని కోట పంచాయతీ కార్యదర్శిగా పని చేసే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములకు 15 మందికి తప్పుడు ధ్రువపత్రాలు మంజూరు చేశారని అభియోగం వచ్చింది. 

అప్పట్లో బాధితులు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయ స్థానం నుంచి స్టే తెచ్చుకున్న కార్యదర్శి విధుల్లో కొనసాగుతున్నారు. ఇటీవల స్టే గడువు ముగియటంతో కార్య దర్శితో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 
సాధిక్ అలీని శుక్రవారం చిలకలూరి పేట న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది