తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని.. తాను లేని సమయంలో.. తన ఇంట్లోనే రాసలీలలకు పాల్పడుతున్న వ్యక్తిని భర్త పథకం ప్రకారం అంతమొందించాడు. ఈ సంఘటన నరసరావుపేటలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామానికి చెందిన కొండమీద వెంకటగిరి అదే గ్రామానికి  చెందిన గొల్లప్రోలు నాగరాజు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నాగరాజు లేని సమయంలో.. అతని ఇంటికి వెళ్లి.. రాసలీలలు కొనసాగించేవాడు. కాగా.. ఈ విషయం కాస్త ఆలస్యంగా నాగరాజుకి తెలిసింది. దీంతో.. తన స్నేహితుడు వీరబ్రహ్మంతో కలిసి వెంటకగిరిని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేశాడు.

ఈ క్రమంలో పథకం ప్రకారం.. మద్యం తాగుదామని వెంకటగిరిని సుబాబుల్ తోట వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ వెంకటగిరిని రాయితో కొట్టి అనంతరం గొడ్డలితో నరికి హత్య చేశాడు. వెంకటగిరి బైక్ ని బావిలో పడేసి తనకేమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లి పోయాడు. కాగా.. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించిందటూ స్థానికులు పోలీసులను ఆశ్రయించడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో చనిపోయిన వ్యక్తి వెంకటగిరిగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  నిందితులు కూడా పోలీసుల ముందు నేరం అంగీకరించడం గమనార్హం.