మతి స్థిమితం లేని యువతికి మాయమాటలు చెప్పి.... ఆమెపై లైంగిక దాడికి పాల్పడి... హత్య చేసిన సంఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. కాగా... ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... గుడూరు రూరల్ కి చెందిన మతిస్థిమితం లేని యువతి ఈ నెల 5వ తేదీన రాత్రి దోసెపిండి తెచ్చుకోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆమె ఇంటికి సమీపంలో ఉన్న సాయి శివకుమార్ అలియాస్ సాయి(20), వెంకటేష్(24), శరత్, వినోద్(22), లక్ష్మయ్య(26)లు ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నారు.

ఆమె ఇంటి నుంచి బయటకు రావడాన్ని ఆ ఐదుగురు గమనించారు. ఆమెపై కన్నేసి.. కుక్క పిల్ల ఇస్తామంటూ మాయమాటలు చెప్పాడు. పాడుపడిన ఓ ఇంట్లోకి ఆమెకు తీసుకువెళ్లి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేశారు.

AlsoRead బ్రహ్మణి కి అమ్మఒడి డబ్బులు... సీఎంకి లోకేష్ థ్యాంక్స్.. పోస్ట్ వైరల్..

దోసెపిండి కోసం వెళ్లిన యువతి ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెంది ఆ ప్రాంతమంతా వెతికారు. అయితే ఆచూకీ తెలియలేదు. మరుసటిరోజున స్థానికులు పాడుబడిన ఇంట్లో యువతి మృతదేహాన్ని గుర్తించి ఆమె కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.

కాగా... సదు యువతి శరీరంపై సర్జికల్ బ్లేడ్ తో గాట్లు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కాగా... ఆ ప్రాంతానికి చెందిన  శివకుమార్ అలియాస్ సాయి గతంలో సర్జికల్ బ్లేడ్ తో ఓ హత్య చేశాడు. దాని ఆధారంగా అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా... నేరం అంగీకరించాడు. అతనితోపాటు.. మిగిలిన నలుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.