Narendra Modi: ప్లాస్టిక్ నివారణలో ఏపీ ముందడుగు.. జీవిఎంసీపై ప్ర‌ధాని ప్ర‌శంస‌లు !

 Narendra Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌లు కురింపించారు. ప్లాస్టిక్ నివార‌ణ చ‌ర్యల్లో ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లను ప్ర‌ధాని మోడీ మ‌న్ కీ బాత్ తో ప్ర‌స్తావించారు. 
 

PM praises AP, Vizag civic body for promoting carry bags made of cloth

Andhra Pradesh: ప్లాస్టిక్ భూతం ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లుగ‌జేస్తూ.. జీవుల‌కు ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాల కార‌ణంగా ఇప్పటికే అనేక జీవ‌జాతుల‌పై ప్ర‌భావం పెరుగుతున్న‌ది. అయితే, ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడ‌కాన్ని త‌గ్గించ‌డం కోసం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ.. ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నివార‌ణ కోసం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. వాటి స్థానంలో ప్ర‌త్య‌మ్నాయ‌ల‌ను తీసుకురావ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. 

ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌లు కురింపించారు. ప్లాస్టిక్ నివార‌ణ చ‌ర్యల్లో ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లను ప్ర‌ధాని మోడీ మ‌న్ కీ బాత్ తో ప్ర‌స్తావించారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ప్రయత్నాల్లో భాగంగా వస్త్రంతో తయారు చేసిన క్యారీ బ్యాగ్‌లను ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌యంగా ఏపీ స‌ర్కారు, జీవీఎంసీ చ‌ర్య‌ల‌ను త‌న మ‌న్‌ కీ బాత్ కార్యక్రమంలో  కొనియాడారు. 

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమీషనర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. " ఆంధ్రప్రదేశ్ మరియు జీవీఎంసీని ప్రధానమంత్రి ప్రశంసించడం మాతృభూమిని రక్షించడానికి మరింత కృషి చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మేము ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1న ప్రారంభించాము. విద్యార్థులు, తల్లిదండ్రులు షాపింగ్‌కు, ప్రయాణాలకు క్లాత్‌ బ్యాగులను వినియోగించేలా ప్రోత్సహించడమే తమ ల‌క్ష్యం అని"  కమిషనర్‌ తెలిపారు. "మేము ఇప్పటివరకు 3,500 మంది విద్యార్థులను సమీకరించడం ద్వారా 75 విద్యా సంస్థలను, ఎక్కువగా పాఠశాలలను కవర్ చేసాము." విద్యార్థులు 5,500 కంటే ఎక్కువ బ్యాగులను సిద్ధం చేశారని పౌర ప్రధాన అధికారి తెలిపారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల స్థానంలో వ‌స్త్రంతో త‌యారు చేసిన బ్యాగుల‌ను పూర్తిగా భ‌ర్తీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. 

ఇదిలావుండ‌గా, పిల్లల్లో శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించేందుకు చిన్న చిన్న ప్రయత్నాలను ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు.ప్రధాన మంత్రి Narendra Modi ఆదివారం నాడు Mann ki Baat లో భాగంగా  దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. క్యాలికులేటర్ ఎలా పనిచేస్తుంది, రిమోట్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందనే విషయమై పిల్లలతో చర్చించాలని ఆయన కోరారు.  కూతుళ్లు  కొత్త, పెద్ద పాత్రల్లో భాద్యతలు నెరవేరుస్తున్నారని ప్రధాని మోడీ చెప్పారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ ను ఆయన ఉటంకించారు. ఆధునిక యుద్ధ విమానాలను మహిళలు కూడా నడపడాన్ని ప్రస్తావిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.  దేశంలోని వేల కొద్దీ కొత్త స్టార్టప్‌లలో మహిళలు డైరెక్టర్ పాత్ర పోషిస్తున్నారని మోడీ వివరించారు. స్థానిక‌ భాషలకు వాటి ప్రత్యేక లక్షణాలున్నాయన్నారు. స్థానిక భాషల్లో అధ్యయనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. స్థానిక  languages ల ప్రాధాన్యతను ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు. మాతృ భాషకు స్వంత శాస్త్రం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios