Asianet News TeluguAsianet News Telugu

ఈ పథకాలన్నీ కేంద్రానివే, చంద్రబాబువి గొప్పలే : ప్రధాని మోదీ

ఆంధప్రదేశ్ కి వచ్చినన్ని సంస్థలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి దక్కిన దాఖలాలు లేవని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులు, ఇచ్చిన సంస్థలపై చర్చించారు. 

pm narendra modi video conference with ap bjp leaders
Author
Delhi, First Published Jan 2, 2019, 6:57 PM IST

ఢిల్లీ: ఆంధప్రదేశ్ కి వచ్చినన్ని సంస్థలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి దక్కిన దాఖలాలు లేవని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులు, ఇచ్చిన సంస్థలపై చర్చించారు. 

ముందుగా కార్యకర్తలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేకూర్చాలంటూ ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుతున్నట్లు తెలిపారు.  

ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని మోదీ స్పష్టం హామీ ఇచ్చారు. కాకినాడ, మచిలీపట్నం, నర్సాపురం, విశాఖపట్నం, విజయనగరం కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగం చేశారు. 

జాతీయ ప్రాధాన్యం ఉన్న 10విద్యాసంస్థలను ఏపీలో ప్రారంభించినట్లు మోదీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు వచ్చినన్ని సంస్థలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి దక్కలేదన్నారు. ఇలాంటి సంస్థలను ఇప్పటి వరకు ఏపీలో ప్రవేశపెట్టనందుకు కాంగ్రెస్, టీడీపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మోదీ. 

తెలుగుదేశం పార్టీ  చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని కోరారు. 

కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆ పథకాలకు అమలుకు సంబంధించి ప్రతీ పైసా కేంద్రానిదేనన్నారు. అలాగే 

కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ‌ప్రచారం చేస్తోందని విమర్శించారు. 

తెలుగుదేశం పార్టీ  చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని కోరారు. 

కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆ పథకాలకు అమలుకు సంబంధించి ప్రతీ పైసా కేంద్రానిదేనన్నారు. అలాగే 

కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ‌ప్రచారం చేస్తోందని విమర్శించారు. 

ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపిస్తే ఈనాడు చంద్రబాబు ఎన్టీఆర్ సిద్ధాంతాలను కాలరాస్తున్నారని విరుచుకుపడ్డారు. 

తెలంగాణాలో టిడిపి, కాంగ్రెస్ కలయికను ప్రజలు తిప్పికొట్టారని గుర్తు చేశారు. అదే పరిస్ధితి ఏపీలో కూడా జరగబోతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 

2014 పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చినట్లు మోదీ స్పష్టం చేశారు. 
కేంద్ర ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 

బీజేపీకి కార్యకర్తలే శక్తి, బలం 
అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న బాధను తాను అర్థం చేసుకుంటున్నట్లు తెలిపారు.  

ఇప్పటి వరకు తాను కేరళ, కర్ణాటక, తమిళనాడు, వంటి రాష్ట్రాలలోని బూత్ స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం 2019లో ఏపీ బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2019లో బీజేపీ కార్యక్రమం ఏపీతోనే ప్రారంభించినట్లు చెప్పారు. 

బీజేపీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారని మోదీ స్పష్టం చేశారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధిని ప్రతీ ఒక్కరికి తెలియజెయ్యాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ మెుబైల్ యాప్ ద్వారా కూడా తనతో పార్టీ పరమైన నిర్ణయాలు పంచుకోవచ్చునని చెప్పారు. 

పార్టీని బూత్ స్థాయిలో బలపరిచేందుకు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తేనే పార్టీ విజయం సాధిస్తుందన్నారు. ప్రతీ కార్యకర్త కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 23 పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు మోదీ. 

ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని విడుదల చేసిన నిధులను యూత్ కు చేరవెయ్యాలని పిలుపునిచ్చారు. బీజేపీపై కొన్ని పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారం వల్ల తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని వారికి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలని కోరారు.  

మరోవైపు ఏపీ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మోదీ హామీ ఇచ్చారు. యువత వ్యతిరేక ప్రచారాన్ని నమ్మవద్దు అని హితవు పలికారు. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, విజన్‌ను యువతకు వివరించాలని కార్యకర్తలకు ఆదేశించారు. యువతతో అన్ని అంశాలపై క్లుప్తంగా చర్చించాలని పిలుపునిచ్చారు. 

యువత అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరారు. ఏపీలో పాలకులు ఏదైనా చేసే ఉంటే ఆ పని గురించి మాట్లాడేవారని వాస్తవాలు ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసునన్నారు. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలి. అర్హులైన యువత ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. 

Follow Us:
Download App:
  • android
  • ios