విశాఖపట్నం ఓడరేవు ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన ఓడరేవు అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. విశాఖ ఓడరేవు ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం జరిగిందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విశాఖ విరజిల్లుతోందని అన్నారు.
విశాఖపట్నం ఓడరేవు ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన ఓడరేవు అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. విశాఖ ఓడరేవు ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం జరిగిందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విశాఖ విరజిల్లుతోందని అన్నారు. నేటికీ విశాఖపట్నం భారతదేశంలో వాణిజ్య కేంద్రంగా ఉందని తెలిపారు. విశాఖపట్నంలో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం హిందీలో ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్రేమించే స్వభావం గలవారని.. స్నేహపూర్వకంగా ఉండటం వారిలో ప్రత్యేకత అని మోదీ అన్నారు. ప్రపంచంలోని ప్రతి మూలలో ఏపీ ప్రజలు వారి ప్రతిభను చాటుతున్నారని మోదీ చెప్పారు. వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ఏపీ ప్రజలు రాణిస్తున్నారని తెలిపారు. 10,000 కోట్లకు పైగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం ఆకాంక్షలు నెరవేరనున్నాయని చెప్పారు.
దేశం అభివృద్దిలో దూసుకుపోతుందని.. మౌలిక సదుపాయాల అభివద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మోదీ చెప్పారు. సప్లై చైన్, లాజిస్టిక్స్ అనేది మల్టీ మోడల్ కనెక్టివిటీపై ఆధారపడి ఉంటుందని.. అందుకే తాము మౌలిక సదుపాయాల విషయంలో కొత్త విధానాన్ని అనుసరించామని చెప్పారు. తాము అభివృద్ధి సమగ్ర దృక్పథానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. మేము పునాది వేసిన ఆర్థిక కారిడార్‌కు 6 లేన్ల రహదారి ఉందని తెలిపారు. పోర్టుకు చేరుకోవడానికి ప్రత్యేక రహదారిని నిర్మిస్తారని తెలిపారు. ఒకవైపు విశాఖ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తూనే.. మరోవైపు ఫిషింగ్ హార్బర్‌ను ఆధునీకరిస్తున్నామన్నారు.
మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు అనేది ప్రతి నగరానికి చాలా అవసరం అని చెప్పారు. ఇప్పుడు చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశమే అందరికీ అశావహ దృక్పథం ఇస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కంభంపాటి హరిబాబులు ఎంతో కృషి చేశారని తెలిపారు. వారు తనను ఎప్పుడూ కలిసి ఏపీ అభివృద్ది గురించే మాట్లాడేవారని చెప్పారు.
రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖపట్నంది కీలక పాత్ర అని తెలిపారు. ఈ కార్యక్రమం మౌలిక సదుపాయాలపై తమ దృష్టిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. సమ్మిళిత అభివృద్ధి కోసం తమకు విజన్ ఉందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో మనం దేనిపై దృష్టి పెట్టాలనే విషయంలో స్పష్టత ఉందని పేర్కొన్నారు. గతి శక్తి ప్రణాళిక మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసిందని.. ప్రాజెక్టుల వ్యయాన్ని తగ్గించిందని చెప్పారు. ఒక వైపు తాము చేస్తున్న అభివృద్దితో దేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని.. మరోవైపు దేశ ప్రజల కోసం సంక్షేమ పథకాలను మరింతగా విస్తరిస్తున్నామని చెప్పారు.
విశాఖ హార్బర్ అభివృద్దితో మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రగతిలో ఏపీ మరింత భాగస్వామ్యం అందిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. తాము తీసుకుంటన్న ప్రతి నిర్ణయం సామాన్యుడి జీవితాన్ని మెరుగుపర్చడం కోసమేనని తెలిపారు. అంతరిక్ష నుంచి సముద్ర గర్భం వరకు ప్రతి అవకాశాన్ని వెతికి పట్టుకుంటున్నామని చెప్పారు.
