మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నారు.
మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీతో 100వ ఎపిసోడ్ పూర్తి కానుంది. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ తన మనసులోని మాటలనే కాకుండా.. తరుచుగా భారతదేశం అంతటా స్ఫూర్తిదాయకమైన కథనాలను పంచుకుంటుంటారు. సంస్కృతి, వారసత్వం, ఆవిష్కరణలతో గొప్ప రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మన్ కీ బాత్ అనేక ఎపిసోడ్‌లలో ప్రముఖంగా ప్రదర్శించబడింది.
మన్ కీ బాత్ గత 99 ఎపిసోడ్‌లలో ఆంధ్రప్రదేశ్‌ను ఏ విధంగా ప్రశంసించారు, ప్రస్తావించారనే అనే వాటికి సంబంధించి ముఖ్య గమనికలను ఇప్పుడు పరిశీలిద్దాం. చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రజల సంకల్పం, సృజనాత్మకత, స్వావలంబన స్ఫూర్తిని ప్రధాని మోదీ హైలైట్ చేశారు. అటువంటి ఒక ఉదాహరణ.. విజయనగరం జిల్లాలో వయోజన విద్యా కార్యక్రమాలకు నాయకత్వం వహించిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు.
అదేవిధంగా వాతావరణ డేటాను విశ్లేషించడంలో, స్థానిక రైతులకు వారి మాతృభాషలో కీలకమైన సమాచారాన్ని అందించడంలో సాయి ప్రణీత్ చేసిన కృషి సమాజ ప్రయోజనాల కోసం సాంకేతికతను ఉపయోగించడంలో చక్కటి ఉదాహరణగా నిలిచింది.
కళ, సృజనాత్మకత రంగంలో ఆటోమొబైల్ స్క్రాప్ మెటల్ ఉపయోగించి శిల్పాలను రూపొందించినందుకు విజయవాడకు చెందిన పడకండ్ల శ్రీనివాస్‌ను, ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు మద్దతు ఇచ్చేలా ప్రజలను ప్రోత్సహించడానికి వినూత్నమైన ఆత్మనిర్భర్ భారత్ చార్ట్‌ను రూపొందించినందుకు విశాఖపట్నంకు చెందిన వెంకట్‌లను ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు.
సాంప్రదాయ ఏటికొప్పాక బొమ్మలను సీవీ రాజు పునరుద్ధరించడం ఈ ప్రత్యేకమైన క్రాఫ్ట్‌కు పాత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి సహాయపడింది. ఇందుకు సీవీ రాజు కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు.
ఈ విధంగా మన్ కీ బాత్‌లో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్‌లోని ఈ కథనాలు రాష్ట్ర విజయాలను, రాష్ట్ర ప్రజల అద్భుతమైన సామర్థ్యాన్ని, ప్రతిభను ప్రదర్శించాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఉదాహరణలను ఇక్కడ పరిశీలించవచ్చు..
> ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ అశోక్ గజపతి రాజు విజయనగరం జిల్లాలో వయోజన విద్యను ప్రోత్సహించారు.
> సాయి ప్రణీత్ వాతావరణ డేటాను విశ్లేషిస్తారు. రైతులకు అవసరమైన డేటాను స్థానిక భాషలో పంపిణీ చేస్తారు. ‘మన్ కీ బాత్’ 79వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగంలో పేర్కొన్నారు.
> విజయవాడకు చెందిన పడకండ్ల శ్రీనివాస్ ఆటోమొబైల్ మెటల్ స్క్రాప్ నుండి వ్యర్థాలను ఉపయోగించి శిల్పాలను రూపొందించారు.
> విశాఖపట్నానికి చెందిన వెంకట్ స్వీయ-అధారిత స్ఫూర్తిని ప్రదర్శించే ABC ఆత్మనిర్భర్ భారత్ చార్ట్‌లను తయారు చేశారు.
> స్వచ్ఛతా డ్రైవ్‌ను అమలు చేయడంలో ఈనాడు టీవీ, రామోజీరావుల ఉత్సాహం, కృషిని ప్రధాన మంత్రి మోదీ గుర్తించారు.
> కేవీ రామ సుబ్బా రెడ్డి మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఆంధ్ర ప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో మిల్లెట్ ప్రాసెసింగ్ సదుపాయాన్ని ప్రారంభించారు.
> ఆంధప్రదేశ్‌కు చెందిన టి విజయ దుర్గా దేశభక్తి గీతాల పోటీలో విజేతగా నిలిచారు. తన ప్రాంతంలోని తొలితరం స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి నుంచి ఆమె ప్రేరణ పొందారు.
> వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని తుంగభద్ర నది ఒడ్డున పుష్కరాలు జరగనున్నాయి.
> ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంకు చెందిన రామ్ భూపాల్ రెడ్డి తన పదవీ విరమణ తర్వాత తన సేవింగ్స్ రూ. 25 లక్షలతో 100 సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిచారు.
> ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బ మామిడి పండ్లను దక్షిణ కొరియాకు ఎగుమతి చేస్తున్నారు.
> విశాఖపట్నానికి చెందిన సీవీ రాజు ఏటికొప్పాక బొమ్మలకు పాత వైభవాన్ని తీసుకొచ్చారు.
> హునార్ హాత్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ తోలు పనులు కూడా ప్రదర్శించబడ్డాయి.
> ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో 100 గంటల నాన్‌స్టాప్ ప్రచారం నిర్వహించబడింది.. ఇందులో భాగంగా 71 గ్రామ పంచాయతీలలో 10,000 మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి.
> విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది.
> ఆంధ్రప్రదేశ్‌లోని నీరు ప్రగతి మిషన్ భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి సాంకేతికతను ఉపయోగిస్తోంది.
