చంద్రబాబుకు ఆడియో టేప్ చిక్కులు

Play 'nice' with Naidu, get everything: AirAsia execs
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ కేంద్ర మంత్రి పి. అశోక్ గజపతి రాజు చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ కేంద్ర మంత్రి పి. అశోక్ గజపతి రాజు చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడితో బాగా ఉంటే ప్రతిదీ వస్తుందని మలేసియాకు చెందిన ఎయిర్ ఆసియా ఉన్నతాధికారి జరిపిన సంభాషణ వెలుగు చూసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. 

ఎయిర్ ఆసియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ ఫెర్నాండెజ్ కు, ఇండియా ఎయిర్ లైన్స్ సిఈవో మిట్టు శాండిల్యకు మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో టేప్ గా దాన్ని చెబుతున్నారు .

ఆ ఆడియో టేప్ సిబిఐ వద్ద ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఫెర్నాండెజ్ పై సిబిఐ ఇటీవల లంచానికి సంబంధించిన కేసును నమోదు చేసింది. 

ఎయిర్ఆసియా ఇండియా లిమిటెడ్ (ఎఎఐఎల్) కు 2015-16లో అంతర్జాతీయ ఆపరేషన్స్ లైసెన్స్ లు పొందేందుకు ఫెర్నాండెజ్ గుర్తు తెలియన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులకు, ఇతరులకు లంచాలు ఇచ్చినట్లు సిబిఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. 

ఆ సమయంలో అశోక్ గజపతి రాజు పౌరవిమాన యాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ ఆరోపణలను ఏయిర్ ఆసియా ఖండించింది. 

loader