అమరావతి:ఏపీ ఈఎస్ఐ స్కాంలో గురువారం నాడు ట్విస్ట్ చోటు చేసుకొంది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేరు కూడ  ప్రచారంలోకి వచ్చింది. అచ్చెన్నాయుడి తర్వాత ఈ శాఖను పితాని సత్యనారాయణ చూశారు.ఈ స్కాంలో పితాని సత్యనారాయణ హస్తం ఉందని కూడ వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అప్పట్లోనే ఖండించారు.

also read:హైకోర్టులో ఊరట: రమేష్ ఆస్పత్రికి అచ్చెన్న, ప్రభుత్వ లాయర్ అభ్యంతరం

అయితే గురువారం నాడు ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి పితాని తనయుడు సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేశాడు. సురేష్ తో పాటు అప్పట్లో మంత్రి వద్ద పనిచేసిన మురళీమోహన్ కూడ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు.

ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో అరెస్టైన అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.