Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఏడాది నుంచి ఆంధ్రలో పైపు ద్వారా వంటగ్యాస్

 తొందరల్లో రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ కోసం ఎదురుచూడ్డం  ఉండదు,పైపుల ద్వారా  ఇంటింటికి గ్యాస్ సరఫరా, వచ్చే జూలై నాటికి పైప్ లైన్ల నిర్మాణం

piped gas in Andhra by next year

పారిశ్రామిక రంగం, రవాణా రంగంతో పాటు ఇళ్ల అవసరాలకు పైప్ లైన్ల ద్వారా గ్యాస్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది జులై నాటికి పైప్ లైన్ల నిర్మాణం పూర్తి చేసి, గ్యాస్ పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తూర్పు గోదావరి  జిల్లా కేంద్రమైన కాకినాడ ఓడరేవు వద్ద లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ టెర్మినల్‌ను నిర్మించనున్నారు. దీనిద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గ్యాస్ ను ఏపీలో పరిశ్రమలు, రవాణా వ్యవస్థతో పాటు ఇళ్ల అవసరాలకు పైప్ లైన్ల ద్వారా సరఫరా చేయనున్నారు.  జైళ్ల అవసరాల నిమిత్తం కూడా గ్యాస్ ను పంపిణీ చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మార్గాల్లో పైప్ లైన్లు నిర్మాస్తున్నారు.  ఈ పైప్ లైన్ల ద్వారా ఏపీకే కాకుండా తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలకూ గ్యాస్ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని సమచార శాఖ ఒకప్రకటనలో తెలిపింది.

 

  • కాకినాడ – శ్రీకాకులం పైప్ లైన్ : తూర్పుగోదావరి నుంచి  విశాఖపట్నం మీదుగా  విజయనగరం వరకూ  గ్యాస్ పైపులైన్  నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకూ 275 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం చేపట్టారు. ఈ పైప్ లైన్ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్రలో పరిశ్రమలకు, రవాణా వ్యవస్థకు ఎంతో ఊతమిచ్చినట్లే.

 

  • మల్లవరం - విజయపూర్  పైప్ లైన్ : మల్లవరం నుంచి  భిల్వారా  మీదగా  విజయపూర్ వరకూ మరో గ్యాస్ పైపులైన్ నిర్మిస్తున్నారు. 1,440 కి.మీ మేర ఈ పైప్ లైన్ ను నిర్మంచనున్నారు. ఈ పైప్ లైన్ నిర్మాణంతో తూర్పు గోదావరి, కృష్ణా, వరంగల్ తో పాటు తెలంగాణలోని ఖమ్మం, రామగుండంతో పాటు ఆ రాష్ర్టంలోని మరికొన్ని ఈ పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ చేయనున్నారు.

 

  • ఎన్నోర్ – నెల్లూరు పైప్ లైన్ :  ఎన్నోర్ – నెల్లూరు పైప్ లైన్ వల్ల ఏపీతో పాటు తమిళనాడుకు లబ్ధి చేకూరనుంది. ఏపీలోని చిత్తూరు, నెల్లూరుతో పాటు తమిళనాడులోని తిరువుళ్లూరు మధ్య 200 కి.మీ. మేర  ఈ పైప్ లైన్ నిర్మాణం సాగుతోంది.

 

  • కేజీ బేసిన్ పైప్ లైన్ : పారిశ్రామిక అవసరాలకు కేజీ బేసిన్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ఉన్న పరిశ్రమలకు ఈ పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 800 కిలోమీటర్ల మేర కేజీ బేసిన్ పైప్ లైన్ ను ఏర్పాటు చేస్తున్నారు.

 

 

  • విజయవాడ – నెల్లూరు పైప్ లైన్ నిర్మాణం :  350 కిలోమీటర్ల మేర విజయవాడ – నెల్లూరు పైప్ లైన్ నిర్మిస్తున్నారు. దీనివల్ల తూర్పు కోస్తా ప్రాంతానికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేఎస్పీఎల్, ఈఎన్ పీఎల్ లను కలుపుతూ నెల్లూరు నుంచి ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా కృష్ణా  జిల్లాల మీదుగా 350 కి.మీ పొడవు పైప్ లైన్ ను నిర్మించనున్నారు.

 

  • తుమ్ కూర్ – నెల్లూరు గ్యాస్  పైప్ లైన్ : ఈ పైప్ లైన్ ద్వారా నెల్లూరు నుంచి  అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు  గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించారు. అంతే కాకుండా ధబోల్ –బెంగళూరు నుంచి వెళ్లే పైప్ లైన్ ద్వారా రాయలసీమలోని  మూడు జిల్లాలకు  గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

 

  • తూర్పు – పశ్చిమ పైప్ లైన్ : తూర్పు – పశ్చిమ గ్యాస్ పైప్ లైన్ ద్వారా ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా జిల్లాలకు గ్యాస్ పంపిణీ చేయనున్నారు. అలాగే, తెలంగాణలోని నల్గొండకు కూడా ఈ పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. 

 

  ఇదంతా వచ్చే ఏడాది జులై నాటికి పైప్ లైన్ ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios