కడపలో కలకలం రేపుతున్న ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్

First Published 3, Jul 2018, 4:43 PM IST
pharmacy student kidnap at kadapa
Highlights

ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు...

కడప జిల్లాలో ఓ యువతి కిడ్నాప్ కు గురయ్యింది. తనను దుండగులు కిడ్నాప్ చేశారంటూ ఓ యువతి తన సోదరి ఫోన్్ కి మెసేజ్  పంపింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇంతకూ ఏం జరిగిందంటే...కడప పట్టణంలోని నిర్మల నర్సింగ్ కాలేజీలో ఓ యువతి ఫార్మసీ చదువుతోంది. అయితే ఇవాళ ఈ యువతి తనను కొందరు దుండగులు ఆటోలో బలవంలతంగా తీసుకుని వెలుతున్నారని సోదరికి ఫోన్ కు మెసేజ్ చేసింది. ఆ తర్వాత యువతికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అయివుంది. దీంతో ఆందోళనచెందిన కుటుంబ సభ్యులు ఈ ఘటనపై కడప చిన్న చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ కు గురైన యువతి కోసం గాలింపుచర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాపర్ల జాడను కనుక్కోడానికి సాంకేతికతను వాడుతున్నారు. అలాగే నగరం లోని ఆటో డ్రైవర్లను విచారిస్తున్నారు.

 
 

loader