Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్ రేట్లే కాదు బంకులు షాకిస్తున్నాయి... కృష్ణా జిల్లాలో ఏం జరిగిందో చూడండి... (వీడియో)

ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రోల్ ధరలతో సతమతమవుతున్న వాహనదారులను కొన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాల కక్కుర్తి నిలువునా ముంచుతోంది.  

Petrol Pump Fraud In krishna district
Author
Vijayawada, First Published Dec 1, 2021, 1:41 PM IST

విజయవాడ: భారీ పెట్రోల్ ధరలతో ఇప్పటికే నడ్డివిరిగిన సామాన్య ప్రజానికానికి కల్తీ బెడద తప్పడంలేదు. ఎంతో కష్టాలకు ఓర్చి వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకుని బ్రతుకుబండిని ఈడుస్తున్న సామాన్యులను పెట్రోల్ బంక్ యాజమాన్యాలు వదిలిపెట్టడం లేదు. తమ లాభాల కోసం పెట్రోల్ ను కల్తీ చేసి వాహనదారులను నట్టేట ముంచుతున్నారు. ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది.   

వివరాల్లోకి వెళితే... krishna district ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్ లో సజ్జ రామారావు అనే వినియోగదారుడు పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఇలా petrol కొట్టించుకున్నాక కొంతదూరం వెళ్ళగానే అతడి బైక్ ఆగిపోయింది. దీంతో అతడు మెకానిక్ వద్దకు వెళ్లగా పెట్రోల్ లో నీరు కలిసి కల్తిఅవడంతోనే బండి ఆగిపోయిందని తెలిపాడు. 

వీడియో

దీంతో byke లోంచి పెట్రోల్ ను ఓ బాటిల్ లో బయటకు తీయగా కల్తీ జరిగినట్లు స్పష్టంగా తెలిసింది. దీంతో ఖంగుతిన్న రామారావు పెట్రోల్ బాటితో బంక్ వద్దకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించినా పట్టించుకోలేదు. దీంతో కాస్త గట్టిగా అడగ్గా పెట్రోల్ బంక్  సిబ్బంది రామారావుపై దాడికి దిగారు.  

read more  ప్రభుత్వం కీలక నిర్ణయంతో దిగోచ్చిన ఇంధన ధరలు.. పెట్రోల్ ధర రూ.8 తగ్గింపు..

పెట్రోల్ బంక్ యాజమాన్యం వినియోగదారులకు చేస్తున్న మోసంతో పాటు తనపై జరిగిన దాడి గురించి రామారావు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అయితే బంక్ యాజమాన్యం రామారావు వద్దనున్న అసలు బాటిల్ ను కాకుండా వేరే పెట్రోల్ బాటిల్ ను చూపించి మభ్య పెట్టేందుకు ప్రయత్నించారు. 

అయితే సిసి కెమెరాలో అసలు విషయం బయట పడటపడింది. పెట్రోల్ రేట్లు మండిపోతున్న తరుణంలో కల్తీకి పాల్పడుతూ వినియోగదారులను తీవ్రంగా మోసం చేస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

read more  మీ ప్రభుత్వాలను అడగండి: పెట్రోల్, డీజిల్ రేట్లపై నిర్మలా సీతారామన్

ఇదిలావుంటే దేశ రాజధాని న్యూడిల్లీలో పెట్రోల్ ధర అమాంతం తగ్గింది. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించింది, ఈ కారణంగా పెట్రోల్ ధర దిగోచ్చింది. డిల్లీ సర్కార్ పెట్రోల్ పై ఏకంగా    రూ.8 తగ్గించడంతో రాజధాని ప్రజలకు నేడు గొప్ప ఉపశమనం లభించింది.

ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.8 తగ్గిన తర్వాత ఇప్పుడు పెట్రోల్ ధర రూ.100 దిగువకు చేరింది. ఢిల్లీ ప్రభుత్వం ఇంధన ధరలపై  ఎక్సైజ్ సుంకాన్ని ఐదు, పది రూపాయలు తగ్గించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గాయి. కేంద్రం నిర్ణయం తర్వాత ఎన్‌డి‌ఏ పాలిత రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి. కొద్ది రోజుల క్రితం పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని ప్రజలకు ఊరటనిచ్చింది.

ఇక ప్రస్తుతం భారతదేశ ఆర్థిక కేంద్రమైన ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ. 109.98కి అందుబాటులో ఉంది. ప్రజలు ఒక లీటర్ డీజిల్‌కు రూ. 94.14 చెల్లించాల్సి ఉంటుంది. అయితే నాలుగు ప్రముఖ మెట్రో నగరాల్లో ముంబైలోనే పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది.

అదే విధంగా తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.56గా ఉండగా, డీజిల్ ధర రూ.91.58గా కొనసాగుతోంది.కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నాయి. దీంతో పెట్రోల్ ధర రూ.104.67, డీజిల్ ధర రూ.89.79గా ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios