ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాష్ట్రంలో దేవాదాయ భూముల బహిరంగ వేలం వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది
ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాష్ట్రంలో దేవాదాయ భూముల బహిరంగ వేలం వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కోవిడ్, కర్ఫ్యూ ఉండగా ఎలా బహిరంగ వేలం నిర్వహిస్తారని పిటిషనర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. కోవిడ్ ఉండగా వేలం నిర్వహణ ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జులై 7వ తేదీకి వాయిదా వేసింది
Add Asianetnews Telugu as a Preferred Source

