కాకినాడ: పెథాయ్ తుఫాన్ తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారుల కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. 28 మత్స్యకారులు సముద్రంలో గల్లంతు కావడంతో జాలర్లు బోరున విలపిస్తున్నారు. తమ బంధువుల ఆచూకీ తెలపాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. 

 తూర్పుగోదావరి జిల్లా కాకినాడ  సమీపంలోని దుమ్ములపేట, పర్లాపేట, ఉప్పలంక గ్రామాలకు చెందిన 28 మంది మత్స్యకారులు ఈనెల 11న వేటకు వెళ్లారు. అయితే చేపవేటకు వెళ్లిన వారి ఆచూకీ నేటికి తెలియకపోవడంతో వారంతా బోరున విలపిస్తున్నారు. 

 పైథాన్ తుఫాన్ సముద్రంలోనే బలహీనపడటంతో వారంతా భయాందోళనకు గురవుతున్నారు. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కనుగొనాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ తమను పట్టించుకోలేదని తమ గోడు వినడంలేదని వాపోతున్నారు. 

మరోవైపు పెథాయ్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చలా తగ్గిపోయాయి. చలి పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో చలి తీవ్రతకు రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది మృత్యువాత పడ్డారు.