మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రతిపక్షం విషప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య సమయంలో ఎవరి ప్రభుత్వం ఉందని ప్రశ్నించారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రతిపక్షం విషప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య సమయంలో ఎవరి ప్రభుత్వం ఉందని ప్రశ్నించారు. అప్పుడు టీడీపీ నేతలు ఏం చేశారని? మండిపడ్డారు. వివేకానందరెడ్డి భార్య, కుమార్తె, అల్లుడిని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి టీడీపీ విడుదల చేసిన పుస్తకంపై పేర్ని నాని స్పందించారు. ఈరోజు పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు సీఎంగా ఉన్నది చంద్రబాబే కదా అని ప్రశ్నించారు. వి

వేకా హత్య కేసును టీడీపీ సరిగా దర్యాప్తు చేయించలేదని అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడికి బాడీ పెరిగింది కానీ బుద్ది పెరగలేదని విమర్శించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు అప్పుడు ఎందుకు నిందితుడిగా చేర్చలేదని ప్రశ్నించారు. సాక్ష్యాలు ధ్వంసం చేసుంటే.. కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 2019 మార్చిలో హత్య జరిగితే మే నెల వరకు ఎందుకు విచారణ చేసి చార్జ్‌షీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. 

ఎన్టీఆర్ మరణంపై దర్యాప్తు జరిపించాలని ఆయన కుమారుడు హరికృష్ణ కోరితే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కూడా విచారణ జరిపించాలంటే చంద్రబాబు స్పందించలేదన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబు నాయుడేనని లక్ష్మీ పార్వతీ చెబుతున్నారు కదా అని అన్నారు. ఎన్టీఆర్ మరణంపై కూడా టీడీపీ పుస్తకం వేయాలని అన్నారు. 

161 సెక్షన్ కింద అధికారులు వాళ్ల ఇష్టమొచ్చింది రాసుకుని సంతకం చేస్తారని.. కనీసం స్టేట్‌మెంట్ ఇచ్చే వారి సంతకం కూడా తీసుకోరని అన్నారు. సీబీఐకి అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చారని టీడీపీ ఎలా చెబుతోందని ప్రశ్నించారు. టీడీపీ చెబుతుంది అబద్దమైనా అయి ఉండాలి.. లేకుంటే సీబీఐ అధికారుల్లో చంద్రబాబు కీలు బొమ్మలు ఉండి ఉండాలని అన్నారు. సీబీఐలోని కొందరు అధికారులు చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తున్నారని అనుకోవాల్సి వస్తుందన్నారు. 

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బలవన్మరణం చెందితే.. ఎందుకు పుస్తకం వేయలేదని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ ఫోన్‌ను తెలంగాణ పోలీసులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ వైసీపీ ప్రభుత్వం వల్లే చనిపోయారని ఆరోపించిన టీడీపీ నేతలు.. ఎందుకు సీబీఐ విచారణను అడగలేదో సమాధానం చెప్పాలని అన్నారు. ఇటీవల ఎన్టీఆర్ కూతురు ఒకరు మరణించారని.. దానిపై సీబీఐ విచారణను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. 

సీఎం జగన్ ప్రజలను, దేవుడిని మాత్రమే నమ్ముకుంటాడని అన్నారు. టీడీపీ విడుదల చేసిన పుస్తకంలో భారతమ్మ ఫొటో వేశారని.. చంద్రబాబు అంతా నీచుడు ఉంటాడా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఆడవాళ్లా? అని ప్రశ్నించారు. ఇతరుల ఇళ్లలో ఆడవాళ్లకు ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం ఉండదా? అని మండిపడ్డారు. చంద్రబాబు నీచుడు, దుర్మార్గుడు అని మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయం కోసం ఇంట్లో ఆడవాళ్లను బయటకు తీసుకొచ్చి బోరుబోరున ఏడ్చాడని విమర్శించారు. ఎదుటి వాళ్ల ఇంట్లో ఆడవాళ్లను కూడా బయటకు తీసుకొచ్చే నీచమైన సంస్కృతి చంద్రబాబుదని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులతో పోటీగా రాజకీయాలు చేయాల్సి రావడం వైసీపీ దురదృష్టం అని అన్నారు. 

చంద్రబాబు నాయుడు ఒక పిరికిపంద అని విమర్శించారు. వాళ్లు విడుదల చేసిన పుస్తకం పార్టీ పేరు గానీ, ఆయన పేరు కూడా లేదని అన్నారు. పుస్తకంలో అన్ని అబద్దాలే ఉన్నాయని.. దానిపై కనీసం పేరు వేసుకునే ధైర్యం కూడా టీడీపీకి లేదని విమర్శించారు. టీడీపీ నేతలకు పబ్లిసిటీ పిచ్చి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. నత్తి మాటలకు, బూతులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్ చెడిపోతే ఆ పెంపకం చంద్రబాబుదే కదా అని ప్రశ్నించారు. ఓరేయ్, తురేయ్ అని లోకేష్ మాట్లాడుతున్నారని.. ఈ సంస్కృతి కూడా అక్కడి నుంచే వచ్చిందే కదా అని అన్నారు. వాళ్ల పార్టీలోని నాయకులను మాటలు అంటున్నారని.. అది వారిష్టమని అన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏరా.. ఒరేయ్.. అనడమేమిటని మండిపడ్డారు. చంద్రబాబును ఏరా చంద్రబాబు అనలేమా? అని ప్రశ్నించారు. కానీ తమకు సంస్కారం ఉందన్నారు. నత్తి మాటలకు, బూతులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని అన్నారు.