Asianet News TeluguAsianet News Telugu

Cinema tickets price row: జగన్ ఆ మాట చెప్పారు, చిరంజీవిని మెచ్చుకున్న పేర్ని నాని

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో చిత్రపరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పెర్నినాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టాలీవుడ్ ప్రతినిధుల బృందం గురువారం కలిసింది. 
 

Perni Nani briefs over YS Jagan's meeting with Tollywood team
Author
Hyderabad, First Published Feb 10, 2022, 4:36 PM IST

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పెర్ని నాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)ని టాలీవుడ్ (Tollywood) ప్రతినిధుల బృందం గురువారం కలిసింది. ఈ స‌మావేశం దాదాపు రెండు గంట‌ల పాటు కొన‌సాగింది. చిన్న బడ్జెట్ సినిమాల ప్రోత్సాహం కోసం సినీ ప్రముఖులు అభ్యర్థించారని  మంత్రి పేర్ని నాని ఆ తర్వాత మీడియాకు తెలిపారు. సినీ పరిశ్రమకు మద్దతు ఇస్తానని ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. 'తెలుగు సినీ ప‌రిశ్ర‌మ (film industry) అభివృద్దికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అవసరమైన సహాయం అందిస్తుందని రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు' అని మంత్రి పేర్ని నాని (Cinematography Minister Perni Nani) వెల్ల‌డించారు.

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి (megastar Chiranjeevi) ప్రతిదీ సమన్వయం చేశారని మంత్రి నాని (Cinematography Minister Perni Nani) పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ సమస్యలపై కూడా కమిటీని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. "చిత్ర పరిశ్రమ ప్రతినిధి బృందం వారు ప్రతి సమస్యను ముఖ్య‌మంత్రి  వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డితో చర్చించినట్లు పేర్కొన్నారు" అని నాని అన్నారు. ఇదిలావుండ‌గా, చిరంజీవితో పాటు ప‌లువురు సీని ప్ర‌ముఖుల‌తో కూడిన బృందం  ముఖ్య‌మంత్రి  వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డితో స‌మావేశ‌మైంది. సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు.  సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చినట్లు చిరంజీవి తెలిపారు. చిన్న సినిమాలు ఐదవ షోకి కూడా ప్రభుత్వం అంగీకరించిందని చిరంజీవి చెప్పారు. ప్రజలు, సినీ పరిశ్రమ కూడా సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయం పట్ల సంతృప్తి చెందుతారని చిరంజీవి అభిప్రాయపడ్డారు.  సినిమా టికెట్ ధరలపై కొన్ని నెలలుగా ఉన్న అనిశ్చిత పరిస్థితులకు శుభం కార్డు పడిందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని చిరంజీవి చెప్పారు. గంటకు పైగా సాగిన ఈ సమావేశానికి చిరంజీవి, ప్రభాస్(Prabhas), మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli), కొరటాల శివ(Koratala Siva), పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali), ఆర్ నారాయణ మూర్తి(R Narayana Murthy), నిరంజన్ రెడ్డి, అలీ (Ali) వంటి ప్రముఖులు హాజరయ్యారు. టికెట్ రేట్ల పెరుగుదలపై త్వరలో అధికారికంగా జీవో విడుదల అవుతుందని టాలీవుడ్ హీరోలు, దర్శకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా విశాఖపట్నం (Visakhapatnam) లో షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ను పరిగణనలోకి తీసుకోమని ముఖ్యమంత్రి టాలీవుడ్ (Tollywood) ప్రతినిధి బృందాన్ని కోరినట్లు చిరంజీవి తెలిపారు. షూటింగ్‌కు అవ‌స‌ర‌మైన అన్ని అనుమ‌తులు ఇస్తామ‌ని తెలిపిన‌ట్టు స‌మాచారం. అలాగే, అందరికీ న్యాయం జరిగేలా టికెట్ ధరలు (Cinema Ticket Price) తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని సీఎం జగన్  (YS Jagan Mohan Reddy) హామీ ఇచ్చారు. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా చూడాల్సిందేనని సీఎం చెప్పారు. అలా చూడకపోతే భారీ ఖర్చుతో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకు రారని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్ (shooting) లను ప్రమోట్ చేస్తున్నామని జగన్ హామీ ఇచ్చారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios