నిత్యావసర ధరలు తగ్గించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు. ఉల్లిగడ్డ రూ. 22 కే విక్రయించాని సూచన. ధరలను అదుపులో పెట్టాలని ఆదేశం 

పెరుగుతున్న ధ‌ర‌లతో సామాన్య జ‌నాలు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని సీఎం చంద్ర‌బాబు పెర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు త‌గ్గాల‌ని అధికారుల‌కు సూచించారు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర అభివృద్దికి, సంక్షేమానికి అధికారులు క‌ట్టుబ‌డి ఉండాల‌ని చంద్ర‌బాబు పెర్కొన్నారు. ఆయ‌న‌ నీరు-ప్రగతి పురోగతిపై సోమ‌వారం జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయ‌న ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు.


సామాన్య ప్ర‌జ‌లు రోజువారి స‌రుకుల ధ‌ర‌ల విష‌మై ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, త‌క్ష‌ణ‌మే ధ‌ర‌ల నియంత్ర‌ణలో పెట్టాల‌ని అధికారులుకు ఆయ‌న సూచించారు. ఉల్లిని 22 రూపాయ‌ల‌కే విక్ర‌యించాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసరాల వస్తువులను డిమాండ్‌కు తగ్గట్లుగా అందుబాటులో ఉంచి ధరలకు కళ్లెం వేయాలని ఆదేశించారు. రైతు బజార్ల సంఖ్యను విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

చెరువు, చెట్టు మన వారసత్వ సంపదని చంద్ర‌బాబు పెర్కొన్నారు. వీటిని పరిరక్షించుకోవడం మన కర్తవ్యమని ఆయన గుర్తు చేశారు. వ‌ర్షాకాలం లో నీటి నిలువ చాలా అవ‌స‌రం అని, 3మీటర్ల దిగువన భూగర్భజలం ఉండాలని అధికారుల‌కు సూచించారు. వర్షాలు ఒకనెలలో ఎక్కువ, ఇంకో నెలలో తక్కువ పడుతున్నాయన్నారు. ప‌డ్డ వ‌ర్ష‌పు నీరు సక్రమంగా హ్యాండిల్ చెయ్యాల‌ని పెర్కొన్నారు. ఏరువాక ప‌థ‌కాన్ని కూడా వనం-మనం తరహాలో విజయవంతం చేయాలని అదేశాలు జారీ చేశారు.