ముఖ్యమంత్రిని ఎంఎల్ఏలు కాకుండా నేరుగా ప్రజలే ఎన్నుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నట్లు చెప్పారు. ఓటు విలువ ఇంకా ప్రజలకు తెలియలేదని వాపోయారు.

ముఖ్యమంత్రిని ప్రజలే నేరుగా ఎన్నుకునే వ్యవస్ధ రావాలని లోక్ సత్తా వ్యవస్ధాక అధ్యక్షుడు, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ‘తక్షణ ఎన్నికల సంస్కరణలు’ అనే అశంపై ఢిల్లీలో ప్రముఖ సామాజిక హక్కుల ఉద్యమనేత అన్నా హజారే ఆధ్వర్యంలో ఓ సదస్సు జరిగింది. అందులో జెపి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని ఎంఎల్ఏలు కాకుండా నేరుగా ప్రజలే ఎన్నుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నట్లు చెప్పారు. ఓటు విలువ ఇంకా ప్రజలకు తెలియలేదని వాపోయారు. ఓటు విలువ తెలిస్తే డబ్బుకు అమ్ముడుపోవటమన్నది ఉండదని అభిప్రాయపడ్డారు.

ఎంఎల్ఏల ఇష్టారాజ్యానికి కూడా అడ్డుకట్ట వేయాలని కూడా కోరారు. ముఖ్యమంత్రిని ప్రజలే నేరుగా ఎన్నుకుంటే స్ధానిక ప్రభుత్వాలు బలపడాయని చెప్పారు. నిజమైన రాజకీయం రావాలంటే రాజకీయాలను కుటుంబ వ్యాపారంగా కాకుండా చర్యలు తీసుకోవాలని కాంక్షించారు. రాజకీయమంటే ప్రస్తుతం ఓ ప్రైవేటు సామ్రాజ్యమైపోయిందని జెపి వాపోయారు. కాబట్టి ఎన్నికల వ్యవస్ధలోనే సమూల మార్పులు అవసరమని నొక్కి చెప్పారు.