సంక్రాంతి సందర్భంగా రేషన్ కార్డ్ లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం చంద్రన్న కానుక పేరిట.. నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సరుకుల్లో నాణ్యత సరిగాలేదని లబ్ధిదారులు ఆందోళన చేపడుతున్నారు.  కర్నూలు జిల్లా నంద్యాలలో రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు సిద్దం చేసిన సరుకులన్నీ నాసిరకంగా ఉండటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పురుగులు పట్టిన పిండి, బూజుపట్టిన బెల్లం ఇస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి తింటే పండుగ రోజున ఆస్పత్రిలో చేరాల్సివస్తుందని భయాందోళనలకు గురవుతున్నారు.

చాలా మంది లబ్దిదారులకు తమకు ఇచ్చిన సరుకులను తిరిగి వెనక్కి ఇచ్చేయడం గమనార్హం. ఇలాంటి నాసిరకం సరుకులు తమకు అవసరం లేదని వారు తేల్చి చెబుతున్నారు. ఈ సరుకుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ లకు అప్పగిస్తే.. వారు పూర్తి స్థాయిలో లబ్ది పొంది.. ప్రజలకు మాత్రం నాసిరకం సరుకులు పంపిణీ చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. కాగా.. ఈ ఘటనపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించడక పోవడం గమనార్హం.