RK Roja: ప్రజలే నా బలం.. హ్యాట్రిక్ విజయం పై రోజా ధీమా ! కానీ..

Roja Selvamani: రాబోయే ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో గెలుస్తానని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ధీమా వ్యక్తం చేశారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైకాపా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాలు తీసుకువ‌చ్చింద‌ని రోజా పేర్కొన్నారు. 
 

People are my strength,  AP Tourism Minister RK Roja confident of hat-trick victories, nagari constituency RMA

Andhra Pradesh Tourism Minister Roja: తాను ప్ర‌జ‌ల్లో ఉన్నాన‌నీ, ప్ర‌జా బ‌లంతో రానున్న ఎన్నిక‌ల్లో మంచి మెజారిటీతో విజ‌యం సాధిస్తాన‌ని వైకాపా నాయ‌కురాలు,  ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇప్ప‌టికే  సొంత పార్టీ క్యాడ‌ర్ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న రోజా నగరి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధిస్తాన‌నే ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ప్రజలు, పార్టీ క్యాడర్‌తో తనకున్న అనుబంధం సానుకూల ఓట్‌గా మారుతుందనీ, అంతర్గత అసమ్మతితో విస్మయం చెందలేదని పేర్కొన్నారు.

కొంత‌మంది కావాలనే చేస్తున్న అసమ్మతి స్వరాలకు పార్టీ క్యాడర్ దూరంగానే ఉంద‌ని అన్నారు. ఇది ప్రత్యర్థుల ఒంటరితనాన్ని ప్రతిబింబిస్తుందనీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారి ప్రభావం అంతంత‌మాత్ర‌మేన‌ని రోజా అన్నారు. త్వరలోనే తన ఎన్నిక‌ల‌ ప్రచారాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. కాగా, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రోజాకు కాకుండా మ‌రోనేత‌కు టిక్కెట్టు ద‌క్కుతుంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. రోజా పేరు ఒంగోలు లోక్‌సభ టిక్కెట్‌కు పరిశీలనలో ఉందని కూడా నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్న త‌రుణంలో మ‌రోసారి న‌గ‌రి టిక్కెట్టు త‌న‌కే ద‌క్కుతుంద‌నీ, గెలుపుపై ఆర్కే రోజా ధీమాను వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

అవినీతికి పాల్ప‌డిన వారిని వ‌దిలిపెట్టే ప్ర‌స్త‌కే లేదు.. బీఆర్ఎస్ కు ఉత్త‌మ్ కుమార్ వార్నింగ్

తాను గ‌త దశాబ్ద కాలంగా న‌గ‌రి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో సభ్యురాలిగా అయ్యాన‌నీ, వారు త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తార‌ని న‌మ్మ‌కం ఉంద‌నీ, వారు త‌న‌పై న‌మ్మ‌కంతో ఉన్నార‌ని రోజా పేర్కొన్న‌ట్టు ది హన్స్ ఇండియా నివేదించింది. అలాగే, "ప్రజలకు లేదా పార్టీ క్యాడర్‌కు నా తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి.. నా పూర్వీకుల మాదిరిగా కాకుండా నేను ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటాను. ఇదే నా గొప్ప బలం" అని రోజా అన్నారు. ఇక్క‌డ‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో సహా అన్ని పార్టీలతో కలిసి పోటీ చేసినా తన నాయకత్వంలోని వైఎస్సార్సీపీ విజయం సాధించిందని గుర్తుచేశారు.

న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలిపారు. 30-40 ఎళ్లుగా ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్న అభివృద్ధిని చూస్తున్నారన్నారు. అయితే, ప్ర‌స్తుతం త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులపై పూర్తిగా దృష్టి పెట్టిన‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే వచ్చే ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించలేదన్నారు. మరికొన్ని రోజుల్లో ఇవి పూర్తయితే అధికారికంగా ఎన్నిక‌ల ప్రచారం ప్రారంభించవచ్చని రోజా పేర్కొన్నారు. కులం లేదా వర్గాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తాను వారి ఆకాంక్షలను నెరవేర్చాననీ, అందుకే ప్ర‌జా మ‌ద్ద‌తు త‌న‌కు ఉంద‌ని రోజా తెలిపారు.

బాబ్రీ మ‌సీదుపై లోక్ స‌భ‌లో అసదుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios