Asianet News TeluguAsianet News Telugu

పెనుమలూరు పంచాయితీ.. ఇటు వైసీపీలో, అటు టీడీపీలో సీటు కోసం రచ్చ, రచ్చ..

మరోవైపు  వైసీపీ నుంచి పెనుమలూరు టికెట్ దక్కని కొలుసు పార్థసారథి  టిడిపిలో చేరడానికి చూస్తున్నారు. టిడిపి నుంచి పెనుమలూరు టికెట్ మీద  పోటీ చేయాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో పెనుమలూరు టిడిపిలో వర్గ విభేదాలు రాజుకున్నాయి.

Penamaluru Conflict, YCP, TDP leaders fight for ticket - bsb
Author
First Published Jan 13, 2024, 10:47 AM IST

పెనుమలూరు : ఆంధ్ర ప్రదేశ్లో ఇప్పుడు మరో నియోజకవర్గం అధికార ప్రతిపక్షాల్లో.. రచ్చ రచ్చగా మారుతోంది. అదే కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం. పెనుమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధికి ఈసారి టికెట్ నిరాకరించింది అధికార వైసిపి. దీంతో పార్థసారథి మనస్థాపానికి గురై పార్టీ మారడానికి టిడిపి వైపు చూస్తున్నారు. పెనుమలూరు టికెట్ ను మంత్రి జోగి రమేష్ కు కేటాయించింది వైసీపీ. దీంతో జోగి రమేష్ పెనుమలూరు నుంచి ఒకవేళ చంద్రబాబు బరిలోకి దిగిన తాను పోటీకి సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విజయానికి సైనికుడిలా పనిచేస్తానన్నారు.

మరోవైపు  వైసీపీ నుంచి పెనుమలూరు టికెట్ దక్కని కొలుసు పార్థసారథి  టిడిపిలో చేరడానికి చూస్తున్నారు. టిడిపి నుంచి పెనుమలూరు టికెట్ మీద  పోటీ చేయాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో పెనుమలూరు టిడిపిలోవర్గ విభేదాలు రాజుకున్నాయి. పెనుమలూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జిగా ఉన్న బోడె ప్రసాద్ కొలుసు పార్థసారథిపై గుర్రుగా ఉన్నారు. టిడిపి కష్టకాలంలో ఉన్న సమయంలో సేవలు కొనసాగించిన తమ అభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకోకుండా పార్థసారథికి టికెట్ ఇస్తే ఓడించడానికి కృషి చేయడానికి బోడే వర్గం సిద్ధంగా ఉంది.

గుంటూరు కారం సినిమా చూసిన బాలినేని.. వైసీపీ కీలక సమావేశానికి డుమ్మా...

మాజీ మంత్రి పార్థసారథి టిడిపిలో చేరితే తన సీటుకే ఎసరు పడుతుందన్న ఆందోళనలో కూడా బోడ ప్రసాద్ ఉన్నట్లుగా సమాచారం. దీంతో పెనుమలూరు నుంచి తానే స్వయంగా పోటీకి దిగుతానని బోడే ప్రసాద్ చెబుతున్నారు. నియోజకవర్గంలోని టిడిపి నేతలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సందర్భంలో కూడా ఆయన ఇదే విషయాన్ని తెలిపారు.  స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా బోడ ప్రసాదునే సమర్థిస్తున్నారు,   బోడ ప్రసాద్ పెనుమలూరు సీటు, గెలుపు  తనదేనని అంటున్నారు.

పెనమలూరు  టిడిపి నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు బోడ ప్రసాద్. ఆత్మీయ సమ్మేళనంలో ఉద్వేగపూరితంగా ప్రసంగించిన బోడ ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గ ప్రజలు తనకు తోడుగా ఉంటే తగ్గేదే లేదని చెప్పుకొచ్చారు. పార్థసారధి వల్ల తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని బోడ ప్రసాద్ ఆందోళనలో ఉండడం వల్లే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారని వినిపిస్తోంది. మరోవైపు నుంచి టిడిపిలోకి చేరుతున్న పార్థసారథి.. తనకు అర్హత ఉన్నా గతంలో వైసీపీలో మంత్రి పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఇప్పుడు టికెట్ విషయంలో కూడా తన పేరును ప్రకటించలేదని దీంతో పార్టీ మారాలనుకుంటున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. టిడిపి అధినేతతో త్వరలో భేటీ అయిన తర్వాత మరిన్ని విషయాలు ప్రకటిస్తానన్నారు. ఇలా పెనుమలూరు రాజకీయం వేడెక్కుతోంది.ఇప్పటికే వైసిపి పెనుమలూరు అభ్యర్థిని ప్రకటించడంతో.. ఇప్పుడు అందరి చూపు టిడిపి వైపే ఉంది.  టిడిపి నుంచి పెనుమలూరు టికెట్ ని ఎవరికి కేటాయిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios