తిరుమలపై రాజకీయాలకే ఈడీ కేసులో వైఎస్ భారతి

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 10, Aug 2018, 10:50 PM IST
Peddireddy makes comments on YS Bharathi
Highlights

తిరుమలపై రాజకీయాలు చేసినందుకే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి భారతి ఈడీ కేసులో నిందితురాలిగా చేరిందని టీటీడీ బోర్డు సభ్యుడు పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

అమరావతి: తిరుమలపై రాజకీయాలు చేసినందుకే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి భారతి ఈడీ కేసులో నిందితురాలిగా చేరిందని టీటీడీ బోర్డు సభ్యుడు పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. దేవుడ్ని రాజకీయాలకు వాడుకోవాలని చూస్తే అనుభవిస్తారని ఆయన అన్నారు. 

నాడు ఏడుకొండలు.. మూడు కొండలు అన్నందుకు శిక్ష పడిందని చెప్పారు. ఇప్పుడు తిరుమలపై రాజకీయాలు చేసినందుకు జగన్ సతీమణి ఈడీ కేసులో ఇరుక్కున్నారని ఆయన అన్నారు. తన భార్యను రాజకీయాలకు లాగుతున్నారని బాధపడుతున్న జగన్.. కోట్ల మంది దైవం శ్రీవారిని రాజకీయాల్లోకి లాగొచ్చా అని అడిగారు

అన్యమతస్థులు శ్రీవారిని నమ్మక పోవచ్చు.. గానీ భక్తులు బాధ పడేలా వివాదాలు సృష్టించ కూడదని ఆయన సూచించారు.

loader