కాకినాడ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దాపురం ఒకటి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క పెద్దాపురం మినహాయించి మిగిలిన అన్ని స్థానాలను వైసీపీ గెలుచుకుంది. మాజీ హోంమంత్రి నిమ్మకాలయ చినరాజప్ప వైసిపి హవాను తట్టుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో ఈసారి పెద్దాపురం రిజల్ట్ పై ఆసక్తి నెలకొంది.    

పెద్దాపురం రాజకీయాలు :

పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా వుంది. తెలుగుదేశం పార్ట ఆవిర్భావం నుండి ఇప్పటివరకు చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు పెద్దాపురం నుండి ప్రాతినిధ్యం వహించారు. 1983,1985 ఎన్నికల్లో బాలసు రామారావు... 1994,1999 లో బిఆర్ రావు... 2014, 2019 లో నిమ్మకాయల చినరాజప్పు గెలిచారు. మధ్యలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పంతం గాంధీమోహన్ గెలిచారు.

అయితే ప్రస్తుతం టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా.... వైసిపి మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. దీంతో ఈసారి ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. పెద్దాపురం నియోజకవర్గంలో కూడా ఆసక్తికర పోటీ సాగింది. 

పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. సామర్లకోట
2. పెద్దాపురం

పెద్దాపురం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 2,01,975

పురుషులు - 1,00,219
మహిళలు ‌- 1,01,740

పెద్దాపురం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

పెద్దాపురంలో ఈసారి ఎలాగైనా గెలిచి పెద్దాపురం అసెంబ్లీపై వైసిపి జెండా పాతాలన్న పట్టుదలతో వైసిపి వుంది. ఈ క్రమంలోనే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు పెద్దాపురం వైసిపి ఇంచార్గీగా కొనసాగుతున్నారు. ఆయననే ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసిపి అదిష్టానం ప్రకటించేలా కనిపిస్తోంది. 

టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ మళ్లీ నిమ్మకాయల చినరాజప్ప నే బరిలోకి దింపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజప్పకు పెద్దాపురంపై మంచి పట్టువుంది. దీంతో ఆయనకే మరో అవకాశం ఇచ్చింది టిడిపి. 

పెద్దాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

పెద్దాపురం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,01,975

వైసిపి - నిమ్మకాయల చినరాజప్ప - 67,393 (41 శాతం) - 1550 ఓట్ల మెజారిటీతో విజయం

టిడిపి - తోట వాణి - 63,366 (38 శాతం) - ఓటమి 

జనసేన పార్టీ - తుమ్మల రామస్వామి - 25,816 (15 శాతం) 

పెద్దాపురం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,50,357 (77 శాతం)

 టిడిపి - నిమ్మకాయల చినరాజప్ప - 75,914 (50 శాతం) - 10,663 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - తోట సుబ్బారావు నాయుడు - 65,251 (43 శాతం) - ఓటమి