పెదకూరపాడు : పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు 2024లో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరు ఖాయం. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ, కొమ్మాలపాటి శ్రీధర్ లు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండటం ఆ పార్టీకి ప్లస్ అయితే... ప్రస్తుతం అధికారంలో వుండటం, గత ఎన్నికల్లో సత్తాచాటి గెలవడం వైసిపికి ప్లస్. ఇలా ఇరుపార్టీలు గెలుపుపై ధీమాగా వుండటంతో పెదకూరపాడు ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.
పెదకూరపాడు రాజకీయాలు :
పెదకూరపాడు రాజకీయాలు చాలా విభిన్నం. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత టిడిపికి కంచుకోటగా వున్న ఈ నియోజకవర్గం ఇప్పుడు వైసిపి చేతికి చిక్కింది. టిడిపి ఆవిర్భావం తర్వాత అల్లంశెట్టి విశ్వేశ్వరరావు, కాసరనేని సదాశివరావులు పెదకూరపాడులో గెలిచారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ హవా సాగింది. ఆయన వరుసగా నాలుగుసార్లు (1989,94,99,2004) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే కన్నా టిడిపిలో చేరి సత్తెనపల్లి నుండి పోటీకి సిద్దమయ్యారు. ఆయన చేరిక పెదకూరపాడులో టిడిపిలో జోష్ నింపింది.
ఇక ఇప్పటికే టిడిపి నుండి కొమ్మాలపాటి శ్రీధర్ రెండుసార్లు (2009,2014) పెదకూరపాడు నుండి గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో టిడిపిని ఓడించి వైసిపి అభ్యర్థి నంబూరి శంకరరావు పెదకూరపాడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
పెదకూరపాడు అసెంబ్లీ పరిధిలోని మండలాలు:
| 1 | బెల్లంకొండ |
| 2 | క్రోసూరు |
| 3 | అచ్చంపేట |
| 4 | అమరావతి |
| 5 | పెదకూరపాడు |
పెదకూరపాడు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
పెదకూరపాడు వైసిపి అభ్యర్థి :
సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు మరోసారి వైసిపి బరిలో నిలవనున్నారు.
పెదకూరపాడు టిడిపి అభ్యర్థి :
టిడిపి నుండి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తో పాటు బాష్యం ప్రవీణ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని పెదకూరపాడు బరిలో నిలపనుందో టిడిపి ఖరారు చేయలేదు.
పెదకూరపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
పెదకూరపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 :
నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 2,22,800
పోలయిన ఓట్లు 1,98,007
వైసిపి - నంబూరి శంకర రావు -99,577 (50 శాతం) - 14,104 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - కొమ్మాలపాటి శ్రీధర్ - 85,473 (43 శాతం) - ఓటమి
జనసేన పార్టీ -పుట్టి సామ్రాజ్యం - 7,198 (4 శాతం)
పెదకూరపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014 :
నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లు 2,01,155
పోలయిన ఓట్లు 1,79,421 (89 శాతం)
టిడిపి - కొమ్మాలపాటి శ్రీధర్ - 90,310 (50 శాతం) - 9,196 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - బొల్లా బ్రహ్మనాయుడు - 81,114 (45 శాతం) - ఓటమి
