ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీ: పేర్లిచ్చిన టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్

ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీకి బీజేపీ, టీడీపీ, పీడీఎఫ్ సభ్యులు తమ పేర్లను పంపారు. 

PDF,TDP, BJP  given names for legislative council select committee

అమరావతి:ఏపీ పాలనా వికేంద్రీకరణ,  సీఆర్‌డీఏ రద్దు బిల్లుల విషయంలో ఏర్పాటు చేయనున్న సెలెక్ట్‌ కమిటీకి టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు సోమవారం నాడు  శాసనమండలి ఛైర్మెన్ కు పంపారు.పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టుగా శాసనసమండలి ఛైర్మెన్ షరీఫ్ ప్రకటించారు.

సెలెక్ట్ కమిటీకి పేర్లను పంపాలని ఆయా పార్టీలకు శాసనమండలి ఛైర్మెన్ లేఖలు రాశారు. ఈ లేఖలు పార్టీలకు వెళ్లకుండా సెక్రటరీ వద్దే ఉండేలా చేశారని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.శాసనమండలి సెక్రటరీని తాము బెదిరించాల్సి అవసరం లేదని కూడ మంత్రి బొత్స సత్యనారాయణ యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

Also read:ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీలో ట్విస్ట్: టీడీపీ, వైసీపీ వాదనలు ఇవీ...

మరోవైపు అధికార వైసీపీ నుండి ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారనే విషయమై ఇంకా పేర్లు అందాల్సి ఉంది. ఈ ఇధ్దరితో పాటు ఈ బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు ఆయా కమిటీలకు ఛైర్మెన్‌లుగా కొనసాగుతారు. 

ఈ తరుణంలో  బీజేపీ, పీడీఎఫ్‌లకు చెందిన ఎమ్మెల్సీలు శాసనమండలి ఛైర్మెన్‌కు తమ పార్టీకి చెందిన సభ్యుల పేర్లను శాసనమండలి సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి పంపడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించకొంది.

బీజేపీ నుండి సోము వీర్రాజు, మాధవ్, పీడీఎఫ్ నుండి కేఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావుల పేర్లను శాసనమండలి ఛైర్మెన్‌కు పంపారు. ఏ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారనే విషయాన్ని శాసనమండలి ఛైర్మెన్‌కు పంపిన లేఖలో ఆయా పార్టీల సభ్యులు ప్రకటించారు.

.మరో వైపు అందరి కంటే ముందే టీడీపీ తమ పార్టీ తరపున ఇద్దరు సభ్యుల పేర్లను కమిటీకి ఇచ్చింది. టీడీపీ నుండి  వికేంద్రీకరణ బిల్లులో సభ్యులుగా ఆశోక్ బాబు, నారా లోకేష్, తిప్పేస్వామి, బీటీనాయుడు, సంధ్యారాణి  ఉంటారు. ఇక సీఆర్‌డీఏ రద్దు బిల్లు కమిటీలో  దీపక్ రెడ్డి, బీద రవి చంద్రయాదవ్, బచ్చుల అర్జునుడు, గౌరవాని శ్రీనివాసులు, బుద్దా నాగజగదీశ్వరరావు పేర్లను తెలుగు దేశం ఇచ్చింది.

ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తూ కేంద్రానికి పంపింది. ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌ లో త్వరగా ఆమోదింపజేసుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు వైసీపీ ఎంపీలు ఈ  తీర్మానం విషయమై పాలో‌అప్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios