Asianet News TeluguAsianet News Telugu

మోదీకి, చంద్రబాబు కు పవన్ ఘాటైన హెచ్చరిక

భయపెట్టి పాలించలేరూ ప్రభూ.... దక్షిణాదిలో ఉన్నది బానిసలు కాదు

pawan warns modi and Naidu of serious consequences on special status

భయపెట్టి పాలించే ధోరణిని మానుకోవాలని ప్రధానిమోదీకి జనసేన నేత పవన్ కల్యాణ్ హెచ్చరిక చేశారు.

 

చుట్టూ రాయపాటి, సుజనాచౌదరి లాంటి వారిని పెట్టుకుని రాజకీయాలు నడపడం మానేసి ప్రత్యేక హోదా కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా ఆయన సలహా ఇచ్చారు.

 

ఈ రోజు హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ, విశాఖ నిరసనకు అనుమతినీయకపోవడం తప్పని ఆయన అన్నారు.  బీచ్ నిరసన ఒక పార్టీ కార్యక్రమం కాదని చెబుతూ కనీసం ఒక గంటయినా అనుమతినిచ్చి ఉండాల్సిందని ఆయన అన్నారు. అనుమతి నిరాకరిస్తే ఉద్యమం ఉదృతమవుతుందని, ఎవరూ ఆపలేరని హెచ్చరించారు.

 

విశాఖ నిరసన అణచివేతకు గురయిన సందర్భంగా ఆయన  ఈ రోజు విలేకరుల ముందుకు వచ్చారు. 

 

విలేకరుల సమావేశం విశేషాలు :

 

కొన్ని దశాబ్దాల కిందటే పరష్కారం కావాల్సిన సమస్యను  ఆలస్యం చేసి, గోటితోపొయే దాన్ని గొడ్డలి దాకా తీసుకువస్తున్నారు.

 

పదవుల్లోకి రాక ముందు చంద్రున్ని స్తామన్నారు. పదవుల్లోకి వచ్చాక తప్పించుకుని తిరుగుతున్నారని ఆయన చంద్రబాబునుద్దేశించి మాట్లాడారు. 2014 లో తను బిజెపిని, తెలుగుదేశాన్ని ఎందుకు సపోర్టు చేశారో వివరిస్తూ ఇపుడు వాళ్లతో ఉండాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు.

 

బిజెపి ని సపోర్టు చేయడానికి కారణం: 10 సంవత్సరాలు కాంగ్రెస్-యుపిఎ పాలనలో... గోటితో పోయే వన్నీగొడ్డలి దాకా వచ్చాయి.

ఇలాగే టిడిపిని సపోర్టు చేశాను.టిడిపి ఇపుడుమిని బిజెపి అయింది. ఆ రోజు మీకోసం నాతో పాటి ఎందరో జండాలు మోశారు.

మద్దతు చెప్పినపుడు నాకు రాజకీయానుభవం ఉందా అని అడగలేదు. మీ ప్రయోజనం కోసం తమిళనాడు, కర్నాటక, తమిళనాడు తిప్పారు

ఇపుడు ప్ర త్యేక హోదా అడిగితే నీ రాజకీయానుభవం ఎంత అంటున్నారు.

 

వోటుకు నోటు కేసు

 

వోటుకు నోటు కేసులో చంద్రబాబు వివాదాస్పదుడయినపుడు ఎందుకు మాట్లాడ లేదంటే:  అన్ని పార్టీలు హార్స్ ట్రేడింగ్ చేస్తాయి. ప్రతిదానికి గొడవ పెట్టుకుని ప్రభుత్వాలను ఇబ్బంది పెడితే, ప్రజలకు ఇ బ్బందులు వస్తాయి. అందుకని వాటిని పట్టించుకోకుండా సమస్యలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించాను. కాని ఇపుడు జరుగుతున్నది వేరు.

 

రాష్ట్ర విభజన తర్వాత. యువకుల కోసం బంగారు తెలంగాణా  హామీని  ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.

 

మూడేళ్ల తర్వాత, బిజెపి తీరు చూస్తే...డిమానెటైజేషన్ దాకా అన్నింటా  ఒంటెత్తుపోకడలకు పోతున్నారు.నాయకులను, బిజెపిని అర్థం చేసుకోవాలనుకున్నా...  అయితే, వారెపుడూ  ప్రజల మనోభావాలను దృష్టిలోపెట్టుకోవడం లేదు. నాకు బాధేస్తుంది.

 

తమిళనాడు,.... జల్లికట్టు

 

జయలలిత చనిపోయాక,  బిజెపి తమిళనాడు రాజకీయాలను శాసించాలని భావించింది.

జల్లికట్టు అనేది ...బిజెపి మీద తమిళనాడు యువకులకు ఉన్న కోపం, ఆక్రోషం. అది కేవలం ఒక అట కోసం సంప్రదాయం కోసం జరిగిన సమీకరణ కాదు. అది తమిళనాట బిజెపి తలదూర్చే రాజకీయాలకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమంగా నేను చూస్తున్నాను.

 

వెంకయ్యనాయుడు గురించి

 

ప్రత్యేక హోదా గురించి  నాడు వెంకయ్య నాయుడు గొంతు చించుకున్నారు.  ఈ రోజు హోదా సంజీవని యా అంటున్నారు,  గతించిన అధ్యాయం అంటున్నారు. అయ్యా, వెంకయ్య గారూ, స్వర్ణ భారత్ ట్రస్టు మీద పెడుతునన్న మనసు ప్రజాసమస్యలమీద, లేదా ఆంధప్రదేశ్ సమస్యలమీద లేదా ప్రతేక హోదా మీద పెట్టి ఉంటే ఈ సమస్య పరిష్కారం అయ్యేది.సన్మానాలు చేయించుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు, అంతేకాని ఇష్టం వచ్చిన ట్లు మాట మార్చకండి.అయిదేళ్లు కాకుంటే పదేళ్ల హోదా మీరు ఇస్తామన్నారు.

 

మీరేమయినా దేవుళ్లా... మేం బానిసలమా.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు ను సపోర్టుకు కారణం

 

  వారి పరిపాలనానుభవమే. ఈ అనుభవంతో హోదా డిమాండ్ ని ముందుకు తీసుకుపోవడం ఆయన ఈ నైతికహక్కు.  డి.మానెటైజషన్  వెనక నేనే  ఉన్నా అన్నారు. తర్వాత ఇబ్బంది అన్నారు. అయిదారు సార్లు మాటమార్చారు. హోదా గురించి కూడా మీరిలా మాట మార్చారు.

 

ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు కారణాలు చెప్పండి.

 

నవ సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ సింగపూర్  తరహాలో అమరావతి రాజధాని నిర్మిస్తామంటున్నారు. ఎక్కడ?

 

కలసి పని చేయడం అనేది కామన్ అజండా అనుకున్నా ఆ రోజు.

అది జరగనపుడు నేనెందుకు మీతో ఉండాలి.

 

సుజనా చౌదరి, రాయపాటి మీద చురకలు

 

జల్లికట్టు స్ఫూర్తితో కోళ్ల పందాలు, పందుల పందేలా ఆడుకోండని సుజనా చౌదరి అంటారు.

ఇది అందరి మనోభావాలను దెబ్బతీసింది.

ఎవరి స్ఫూర్తితో మీరు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారు,.

రుణాలు తీసుకోని కూడా పే చేయలేకపోయారు.

మీ వెనకాల ఇన్ని లోపాలున్నాయి. మరొకరిని విమర్శించే హక్కు మీకు లేదు.

చేతనైతే హోదా కోసం పోరాడండి. పోరాడే వారిని లాగవద్దు.

సిఎం గారూ, మీ పరిపాలన అనుభవంతో బంగారు ఆంధ్రప్రదేశ్  చేస్తారనుకున్నాం. అయితే, మీచట్టూ రాయపాటి, సుజనా లాంటి వాళ్లున్నారు.

పోలవరం కాంట్రాక్టర్ రాయపాటి  ప్రాజక్టు మట్టిని  రైతుల పొలాలలో వేస్తున్నారు.రైతులకు సమస్యలు సృష్టించారు.

సుజనా చౌదరి, రాయసాటి మీద అరోపణలున్నాయి. అంబుడ్స్మన్ పెట్టి వారి మీద విచారణ జరిపించండి.

మీ  ఆదర్శ మూర్తి సింగపూర్ లీ క్వాన్ యూ అదే చేశారు.

విశాఖమార్చ్ అనుమతి ఇవ్వాల్సింది. కనీసం ఒక గంట సేపు.

అది పార్టీ కార్యక్రమం కాదు. అపినందున ఉద్యమం ఇంకా ఉదృతం మవుతుంది. దీనిని ఆపలేరు.

 

భయపెట్టి పాలించలేరూ ప్రభూ....

 

కేంద్రం, మోదీ : మోదీగా రూ  మీరు భయపెట్టి దేశాన్ని  పాలించాలనుకుంటున్నారు. విద్యార్థులను, ప్రొఫెసర్లను భయపెడుతున్నారు. పోలీసులతో ఒక్క కాశ్మీర్ ను కంట్రోల్ చేయించాలనుకుంటున్నారు, కాని కావడం లేదు. జల్లికట్టుని కూడా పోలీసులతో కంట్రోల్ చేయాలనుకున్నారు. ఇలా గే విశాఖని. అది సాగదు.

కేంద్రానికి, మిగతా నాయకులందరికి హెచ్చరిక,

ప్ర త్యేక  హోదా ఇస్తారా లేదా అనే దానికంటే, ఎన్ని సార్లు మీరు మాటలు మార్చారో ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వండి.

హోదా కు బదులు అర్థరాత్రి పూట ప్యాకేజీ ప్రకటించారు. మీలో  ఎవో తప్పులున్నాయి. లేకపోతే, అర్థరాత్రి ప్యాకేజీ ప్రకటన  ఏమిటి?

రాష్రానికి రావలసివన్నీ కూడ పేరు మార్చి ప్యాకేజీగా ప్రకటించారు.

పోలవరం మల్టిపర్పస్ ప్రాజక్టు. మీరిచ్చిన పర్మిషన్ కేవలం నీటిపారుదలకే – దీనికి సమాధానం చెప్పండి.
 

 

దక్షిణాదిని రెచ్చగొట్టవద్దు

 

దక్షిణాది రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున నిరసన లొస్తాయి.

ప్రజలు బానిసల్లాగా కనబడుతున్నారేమో. బానిసలు తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసుకోండి.

తెలంగాణా వందల మంది చనిపోతేనేజాతీయ వార్త, ఢిల్లీ లో తుమ్మితే జాతీయ వార్త

ప్రతికలు దక్షిణాదిని విస్మరించవద్దు.

దక్షిణాది రాష్ట్రాలను విడగొట్టిన మీరు యుపి, విదర్భ అను విడదీయడం లేదు.

దక్షిణాది బలహీనంగా ఉండాలి. ఉత్తరాది బలంగా ఉండాలనేనా మీ సంకల్పం.

Follow Us:
Download App:
  • android
  • ios