ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ వార్నింగ్ వ్యవసాయ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటు ప్రకటన.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 11 వ్య‌వ‌సాయ కళాశాలల్లో చ‌దువుకుంటున్న మూడు వేల మంది బీఎస్సీ అగ్రిక‌ల్చ‌ర్ విద్యార్థులు గ‌త 25 రోజులుగా నిర‌స‌న తెలుపుతున్నారు. ఈ రోజు కొందరు వ్యవసాయ విద్యార్థులు ప‌వ‌న్ క‌లిసి త‌మ స‌మ‌స్య‌లను విన్న‌వించుకున్నారు. విద్యార్ధుల సమస్యలపై పవన్ ఓ ప్రకటనను ప్రభుత్వానిక హెచ్చరికగా విడుదల చేశారు.

వ్య‌వ‌సాయ అధికారుల‌ జీవోను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. సంవత్సరాల పాటు కష్టపడి చదివిన విద్యార్థుల భవిషత్తు అందకారం చెయ్యోద్దని సూచించారు. రైతుల క‌ష్టాల‌ను తీర్చేందుకు నిపుణులైన విద్యార్ధుల‌ను వెంట‌నే నియ‌మించాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం పై విద్యార్థులతో ప్ర‌భుత్వం చర్చించాల‌ని ప‌వ‌న్ సూచించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించపోతే త‌మ‌ వంతు పాత్ర పోషించడానికి వెనకాడబోమని ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రిస్తూ ప్రకటన విడుదల చేశారు. 

మరిన్ని వార్తాల కోసం కింద క్లిక్ చేయండి.