స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ దశలో చెలరేగిన హింస, దౌర్జన్యాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అభ్యర్థఉలతో నామినేషన్లు దాఖలు చేయించే సమయంలో దాడులు చేయడం, వాటిని ఎదుర్కొని నామినేషన్ ఇచ్చినా.. బలవంతంగా ఉపసహరింపజేయడం దురదృష్టకరమన్నారు.

Also Read నిమ్మగడ్డతో ఒకే కంచం, ఒకే మంచం...గుర్తురాలేదా?: జగన్‌కు టిడిపి ఎమ్మెల్సీ చురకలు...

అధికార పార్టీ చెప్పుచేతల్లో అధికార యంత్రాంగం పనిచేయడం బాధాకరమన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో చోటుచేసుకున్న దౌర్జన్యాలపై ఎంత మాత్రం మౌనంగా ఉండకూడదని ఆయన తన పార్టీ నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ ఖూనీ చేసిన తీరు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తామన్నారు.

ఈ మేరకు ఆయన పార్టీ ముఖ్య నేతలు, ఇన్ ఛార్జలతో పవన్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో దౌర్జనక్యాలపై మౌనంగా ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో మరింత పెట్రేగిపోతారని పవన్ అన్నారు. 

మీ పరిధిలో నామినేషన్ వేసేందుకు ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా.. దాడులు చేసినా తన దృష్టికి తీసుకురావాలని పవన్ తన పార్టీ నేతలకు వివరించాడు. తమ పార్టీ అభ్యర్థులపై దాడి జరిగిన విషయాలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. బీజేపీ అభ్యర్థులపై కూడా దాడి జరిగిందని ఆయన అన్నారు. పార్టీ అభ్యర్థులు, నాయకులపై దాడులు జరుగుతుంటే రక్షించాల్సిన పోలీసుల వివరాలతోపాటు.. నామినేషన్లు అడ్డుకున్న అధికారుల వివరాలు కూడా తనకు తెలియాలని పవన్ చెప్పారు.

వాటన్నింటినీ తాను పరిశీలించి కేంద్ర హోంశాఖకు అందజేస్తానని అన్నారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల దృష్టికి కూడా తీసుకువెళతానని చెప్పారు.