ఒకవైపు నారా లోకేష్  లేదా టిడిపి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై పరువు నష్టం దావా గురించి ఆలోచిస్తుంటే పవన్ మరింత రెచ్చిపోతున్నారు. నారా లోకేష్ అవినీతిపై తన వద్ద పూర్తి ఆధారాలున్నట్లు చెబుతున్నారు. లోకేష్ చేసిన అవినీతి గురించి తన వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతానంటూ ఎదరు ప్రశ్రిస్తున్నారు. సమయం వచ్చినపుడు ప్రతీ ఆధారాన్ని బయటపెతానని ప్రకటించటంతో టిడిపిలో కలకలం మొదలైంది.

మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబునాయుడు, లోకేష్ అవినీతిపై విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ ఆరోపణలతో తండ్రి, కొడుకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతుకుముందు వరకూ ‘ చంద్రబాబు నేతలతో ఎప్పుడు మాట్లాడినా పవన్ మనవాడే’ అంటూ చెబుతూండేవారు. అటువంటి పవన్ ఒక్కసారిగా యు టర్న్ తీసుకోవటంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది.

దానికి తగ్గట్లే చంద్రబాబు, లోకేష్ పై పవన్ తన ఆరోపణలను కొనసాగిస్తూనే ఉన్నారు. దాంతో ఉదయం మీడియాతో లోకేష్ మాట్లాడుతూ, పవన్ పై పరువునష్టం దావా వేసే అంశాన్ని టిడిపి చూసుకుంటుందని హెచ్చరించారు. అటువంటిది పవన్ తాజాగా లోకేష్ అవినీతిపై తన వద్ద పూర్తి ఆధారాలున్నట్లు ప్రకటించటంతో టిడిపిలో కలకలం మొదలైంది.