జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ తో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్రం విచారణ జరిపి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలే లోకేష్ అవినీతికి పాల్పడుతున్నారని తనతో చెప్పినట్లు పవన్ అన్నారు. అదే విషయాన్ని తాను చంద్రబాబుకు నాలుగేళ్లుగా చెబుతునా ఉపయోం కనబడలేదన్నారు. తన ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నదని బాబుకు స్పష్టంగా తెలుసు. ఆయన స్పందించకపోవడంతోనే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాల్సొచ్చిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ను ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగించడం వెనుక కూడా భారీ కుంబకోణం ఉందన్నారు. మరి ఈ అవినీతి అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, తనకు ప్రధాని తెలిసినా నా పరిమితులు నాకు ఉంటాయి.

తానేమీ ఎంపీని కాదన్నారు. అయినా టీడీపీ, బీజేపీ మధ్య మంచి బంధం ఉంది కాబట్టి తానిప్పుడు లోకేష్పై ఆరోపణలు చేస్తుంటే నా వెనుక మోదీ ఉన్నారంటున్నారు. గతంలో జగనేమో తన వెనుక బాబు ఉన్నారటాన్ని తప్పుపట్టారు. తాను కేవలం ప్రజలు చెప్పిందే వింటున్నానని పవన్ స్పష్టంచేశారు.

ఇక ప్రత్యేక హోదాపై స్పందిస్తూ రాష్ర్టానికి హోదా వస్తుందా రాదా అన్నది అనవసరమన్నారు.  హోదా పేరుతో పనిలేదని చెప్పారు. ప్రస్తుతం రాష్ర్టానికి కేంద్రం ఆర్థిక సాయం కావాలని తెలిపారు.. తమ డిమాండ్లను నెరవేర్చుకునేవరకు బీజేపీపై పోరాటం ఆగదన్నారు. ప్రస్తుతానికి జనసేన ఒంటరి పోరాటం చేస్తున్నా ఎన్నికల సమయంలో అవసరమైతే ఎవరితో కలిసి వెళ్లాలో నిర్ణయించుకుంటామని పవన్ అన్నారు. కేసీఆర్, బాబు పాలనలకు పదికి ఎన్ని మార్కులు ఇస్తారని అడగినపుడు కేసీఆర్కు 6, బాబుకు 2.5 మార్కులు ఇస్తానని స్పష్టంచేశారు.