ముమ్మిడివరం: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తన మాటలన వక్రీకరిస్తూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని అది సరికాదన్నారు. ఫోటోలు మార్పింగ్ చేసే దీన స్థితికి టీడీపీ దిగజారి పోయిందంటూ మండిపడ్డారు. 

ఇంతలా టీడీపీ నాయకులు దిగజారిపోతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు ఒక్కటే చెప్తున్నా పిచ్చిపిచ్చి వేషాలు ఆపెయ్యండి నీచంగా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్. 

టెక్నాలజీవాడకం మీ కంటే తనకు బాగా తెలుసనని పవన్ కళ్యాణ్ చెప్పారు. తానొక ఫిల్మ్ డైరెక్టర్ ను, స్క్రీన్ ప్లే కూడా తెలుసనని గుర్తు చేశారు. టెక్నాలజీని బాగా అవగాహన చేసుకున్న వాడినని మీలా చెయ్యాలనుకుంటే తాను చాలా చెయ్యగలనని చెప్పుకొచ్చారు. ఇలాంటి చిల్లర వేషాలు తన దగ్గర వేయోద్దు అంటూ హెచ్చరించారు.  

నా మాటల్ని రివర్స్ లో క్రియేట్ చేసి విమర్శిసిస్తున్న కుచ్చిత స్వభావులకు ఒక్కటే చెప్తున్నా ఇలాంటివి చేయోద్దు అంటూ హితవు పలికారు. నాకు జన్మనిచ్చిన కన్న తల్లిని కానీ భారతమాతను కానీ పిచ్చి మాటలు మాట్లాడితే మామూలుగా ఊరుకోను అంటూ గట్టిగా చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను మార్పింగ్ చేస్తున్న టీడీపీ నేతలకు మువ్వన్నెల జెండాను పట్టుకునే అర్హత లేదన్నారు.  

తాను ప్రజలను రెచ్చగొట్టేందుకు రాలేదన్న పవన్ ప్రజలకు 25 ఏళ్ల బంగారు భవిష్యత్ ఇచ్చేందుకే వచ్చానన్నారు. స్కామ్ ల మీద జైలుకెళ్లిన వ్యక్తి జగన్ ఒకవైపు, కొడుకు అసమర్థతతో అవినీతి పార్టీలా, దోపిడీల పార్టీగా మారిన టీడీపీ మరోవైపు ఏమీ ఆశించకుండా రాజకీయాల్లోకి వచ్చాని జనసేన మరో వైపు ఉన్నాయన్నారు.  

అవినీతి పార్టీ అయిన వైసీపీకి ఓటేస్తారో, దోపిడీ పార్టీ అయిన టీడీపీకి ఓటేస్తారో తేల్చుకోవాలని కోరారు. భగవంతుడిని తలచుకుని ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. మనస్సాక్షిగా ఓటెయ్యండన్నారు. మీరు నాకు ఒక్కసారి అండగా నిలబడితే తుది శ్వాస వీడేవరకు మీకు అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే చొక్కా పట్టుకుని లాగండి అన్నారు. 

ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ప్రధాన మంత్రి మోదీకి వినబడేలా, చేతగాడిలా కూర్చున్న అసమర్థ సీఎం చంద్రబాబు,లోకేష్ లకు వినబడేలా, అసలు పౌరుషం లేని జగన్ కు వినబడేలా భారత్ మాతాకి జై అని నినదించాలంటూ భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగాన్ని ముగించారు పవన్ . 

ఈ వార్తలు కూడా చదవండి

రౌడీ ఎమ్మెల్యేలను అరికట్టలేని వ్యక్తివి నువ్వా సీఎం:చంద్రబాబుపై పవన్

పరిశ్రమలు స్థాపించరు కానీ కోట్లు దోచేస్తారు: సుజనాచౌదరిపై పవన్

చంద్రన్నకు సెలవిద్దాం, జగన్ ను పక్కన పెడదాం:పవన్ కళ్యాణ్