కాలినడకన తిరుమలకు పవన్ కల్యాణ్: బస్సు యాత్రకు రెడీ

కాలినడకన తిరుమలకు పవన్ కల్యాణ్: బస్సు యాత్రకు రెడీ

తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారంనాడు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు స్వాగతం పలికారు.

అదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన తిరుపతి చేరుకుంటారు. ఆయన క్యూలైన్లో నించున్నారు. ఆ తర్వాత తిరుపతి, చిత్తూరుల్లో పర్యటిస్తారు. ఇక్కడే ఆయన తన బస్సు యాత్ర గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. 

బస్సు యాత్రను అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించాలా, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభించాలా అనే వి,షయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆది, సోమవారాల్లో పర్యటన వివరాలు వెల్లడించే అవకాసం ఉంది. 

శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకు రేణిగుంట విమానాశ్రయం అలిపిరికి చేరుకున్నారు. అక్కడ వాహనం దిగగానే ఆయనపై పూలవర్షం కురిపించారు. పాదాల మండపం వద్ద ఆయన స్వామివారికి మోకాల్లపై మోకరిల్లి నమస్కారం చేసుకుని నడకను ప్రారంభించారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos