ఈ నెల 15 నుండి ఉత్తరాంధ్రలో పవన్ టూర్: పార్టీ నేతలతో భేటీ కానున్న జనసేనాని

ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  పర్యటించనున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి మూడు రోజులు  పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. 
 

Pawan Kalyan To  Visit Uttarandhra districts From October 15

విశాఖపట్టణం:  ఈ నెల 15వ తేదీ నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.మూడు జిల్లాలకు చెందిన జనసేన నేతలతో పవన్ కళ్యాణ్  భేటీ కానున్నారు. మూడు జిల్లాల నేతలకు పవన్ కళ్యాణ్ దిశా నిర్ధేశం చేయనున్నారు. ఉత్తరాంధ్ర జనసేననేతలు,  వాలంటీర్లతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనవాణి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు. 

 విశాఖపట్టణం కేంద్రంగా మూడు రాజధానులకు మద్దతుగా  వైసీపీ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.మరో వైపు అమరావతి నుండి అరసవెల్లికి పాదయాత్రగా  అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో రైతుల  పాదయాత్ర సాగుతుంది.  మూడు రాజధానులకు మద్దతుగా  పాదయాత్రలు సాగుతున్నాయి. 

ఈ తరుణంలో విశాఖపట్టణం కేంద్రంగా పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యత  సంతరించుకుంది.మూడు  రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుంది.  అమరావతి రాజధానికే పవన్ కళ్యాణ్ తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. అమరావతికి తొలుత మద్దతుప్రకటించిన వైసీపీ ఆ తర్వాత   మూడు రాజధానులను తెరమీదికి తీసుకు వచ్చిందని విపక్షాలు  విమర్శలు గుప్పిస్తున్నాయి. 

మూడు రాజధానులకు మద్దతుగా ఈ నెల 15న విశాఖపట్టణంలో విశాఖగర్జన నిర్వహించడంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. వికేంద్రీకరనపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు కురిపించారు. వైసీపీ సర్కార్ తీరును ట్విట్టర్ వేదికగా ఆయన ఎండగట్టారు. జనసేన ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలపై వైసీపీ  కూడా తీవ్రంగా స్పందించింది. జనసేనాని చేసిన విమర్శలపై మంత్రులు, వైసీపీ నేతలు  సోషల్ మీడియాతో పాటు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి బహిరంగంగానే విమర్శలు చేశారు. వైసీపీ చేసిన విమర్శలపై పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

also read:దత్త తండ్రి తరఫున దత్త పుత్రుడు మియావ్ మియావ్.. పవన్ కల్యాణ్‌ ట్వీట్స్‌పై ఏపీ మంత్రుల ఫైర్..

2014లో చంద్రబాబు సర్కార్  అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేసింది.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెర మీదికి తీసుకు వచ్చింది.  29 గ్రామాల రైతుల కోసం  రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ది కాకుండా అడ్డుకొంటారా అని వైసీపీ ప్రశ్నిస్తుంది. అన్ని ప్రాంతాలు అభివృద్ది కావాలనే ఉద్దేశ్యంతోనే మూడు రాజధానులను తెరమీదికి తెచ్చినట్టుగా వైసీపీ చెబుతుంది. దేశంలో ఎక్కడా కూడా మూడు రాజధానులు లేవని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios