అమరావతి:  జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున ఒక పత్రిక పెడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ భావజాలం, ప్రణాళికలు, నిర్ణయాలు, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా కథనాలు ఉండాలని ఆయన తెలిపారు. 

మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి ఈ పత్రిక ఒక వేదిక పవన్ కల్యాణ్ కావాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక తోడ్పాటు అందించాలని అన్నారు. పత్రిక స్వరూప స్వభావాలు, శీర్షికలు ఉండాల్సిన అంశాలను నిర్ణయించడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు
 
ఇటీవల జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ జనసేన ఒక ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. పార్టీ ఓటమిపై నేతలతో సమీక్ష నిర్వహించిన పవన్ కల్యాణ్ పత్రిక పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.