విజయవాడ: వామపక్షాలతో పొత్తులను ఖరారు చేసే ప్రక్రియకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీ నేతలతో ఆయన మంగళవారం చర్చలను ప్రారంభించారు. 

సిపిఐ, సిపిఎం నేతలతో తొలుత జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యాలయంలో చర్చలు జరిపారు. తర్వాత వామపక్ష నేతలతో కలిసి ఆయన పవన్ కల్యాణ్ నివాసానికి చేరుకున్నారు. 

పవన్ కల్యాణ్ వామపక్ష నేతలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు. తమ పార్టీ పోటీ చేసే స్థానాలను, ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు కేటాయించే సీట్లను పవన్ కల్యాణ్ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.